బిల్ క్లింటన్.. ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు! అమెరికా విషయాలు భారతీయ సామాన్యులకు బాగా ఆసక్తి పుట్టించిన దశలో అమెరికాకు అధ్యక్షుడు క్లింటన్. అమెరికాతో భారత బంధం బాగా డెవలప్ అయ్యింది కూడా క్లింటన్ హయాంలోనే మొదలు. భారత పర్యటనకు కుటుంబ సమేతంగా వచ్చిన క్లింటన్ పేరు ఇండియాలో మార్మోగింది. అంతకు మించి.. క్లింటన్ వ్యక్తిగత వ్యవహారాలు కూడా ఇండియాలో బాగా ప్రచారానికి నోచుకున్నాయి. అలాంటి వాటిల్లో వైట్ హౌస్ లో ఆయన సాగించిన రాసలీలలు ముఖ్యమైనవి.
ఇలాంటి ఎక్కడైనా ఇంట్రస్టింగే. అలాంటి వైట్ హౌస్ లోనే అధ్యక్షుడి రొమాన్స్ అంటే.. దానిపై ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు కదా! మోనికా లెవిన్స్కీతో క్లింటన్ ఎఫైర్ నడించారనే వార్త ప్రపంచమంతా మార్మోగింది. వైట్ హౌస్ లో ఇంటర్న్ గా చేసిన ఆ అందగత్తెతో అమెరికా అధ్యక్షుడు రొమాన్స్ సాగించారని, వారికి ఎఫైర్ ఉండేదని ప్రచారం జరిగింది. అదెంత వరకూ వెళ్లిందంటే.. ప్రపంచమంతా క్లింటన్ ను ఒక రసికుడిగా వర్ణించేంత వరకూ వెళ్లింది. ఆఖరికి తెలుగు సినిమా పాటల్లో కూడా క్లింటన్ రసికత గురించి ప్రస్తావించారంటే అప్పట్లో ఆ ఎఫైర్ ఎంత కల్ట్ హిట్ అయ్యిందో సులభంగా అర్థం చేసుకోవచ్చు.
హైటెక్కు టెక్కు చూసి హీటు పుట్టి వెంటనే.. ఫ్లైటెక్కి నిన్ను చూసి క్లింటనే..అంటూ తెలుగు హీరోయిన్ల గురించి వర్ణించేందుకు క్లింటన్ పేరును మానోళ్లు వాడేసుకున్నారు. అమెరికాలోనూ ఈ అంశంపై విస్తృతమైన చర్చ జరిగింది. ఈ వ్యవహారంపై వైట్ హౌస్ లో ఒక కమిటీ ఏర్పడింది. అయితే పదవిలో ఉన్నప్పుడు క్లింటన్ ఈ ఎఫైర్ ను ధ్రువీకరించలేదు.
అయితే తాజాగా ఒక డాక్యుమెంటరీలో ఆయన స్పందించారు. తనకు లెవిన్స్కీతో ఎఫైర్ నిజమే అని స్పష్టం చేశారు. అప్పట్లో అమెరికా అధ్యక్షుడిగా తను తీవ్రమైన ప్రెజర్ ను ఎదుర్కొన్నట్టుగా, తన పరిస్థితి 30 బౌట్లను ఎదుర్కొన బాక్సర్ లా ఉండేదని.. ఆ ఒత్తిడిలో ఊరట పొందడానికి లెవిన్స్కీతో ఎఫైర్ ఏర్పడిందని క్లింటన్ తేల్చేశారు. తను ఆ విషయంలో లెవిన్స్కీకి క్షమాపణలు చెబుతున్నట్టుగా, తమ మధ్య సెక్స్ ఎఫైర్ ఉండేదని క్లింటన్ చెప్పారు. ఈ విషయంపై అప్పట్లోనే తన భార్య హిల్లరీకి కూడా క్లారిటీ ఇచ్చినట్టుగా క్లింటన్ చెప్పారు.
అది తనకు అప్పట్లో షాకింగ్ అని హిల్లరీ వ్యాఖ్యానించింది. మొత్తానికి తన రసికత గురించి ఉన్న ప్రచారాలు నిజమే అని క్లింటన్ స్పష్టం చేసినట్టుగా అయ్యింది. అమెరికాకు రెండు సార్లు అధ్యక్షుడిగా వ్యవహరించి గౌరవంగానే రాజకీయాల నుంచి తప్పుకున్నారు క్లింటన్. ఆ తర్వాత ఆయన భార్య కూడా అమెరికా లో ఉన్నత పదవులను పొందింది. అధ్యక్ష బరిలో నిలిచి ట్రంప్ చేతిలో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.