ఇలియానా గర్భం దాల్చిన సంగతి తెలిసిందే. ఇందులో ట్విస్ట్ ఏంటంటే, ఆమె ఇంకా పెళ్లి చేసుకోలేదు, ప్రియుడు ఎవరనేది కూడా బాహ్య ప్రపంచానికి తెలియదు. ఈరోజే ఆమె తన ప్రియుడి ఫొటోని విడుదల చేసింది. త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతోంది.
ఈ మొత్తం వ్యవహారంపై పరోక్షంగా కామెంట్స్ చేసింది హీరోయిన్ తాప్సి. కొద్దిసేపటి కిందట సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ముచ్చటించింది. చాలామంది హీరోయిన్లకు ఎదురైనట్టుగానే, తాప్సికి కూడా 'పెళ్లెప్పుడు' అనే ప్రశ్న ఎదురైంది.
“నేను ఎప్పుడు పెళ్లి చేసుకుంటానని చాలామంది అడుగుతున్నాను. నేనింకా గర్భవతిని కాలేదు. కాబట్టి ఇప్పట్లో నా పెళ్లి ఉండకపోవచ్చు. అలాంటిదేమైనా జరిగితే అందరికీ చెబుతాను.”
ఇలా తన పెళ్లిపై గమ్మత్తుగా స్పందించింది తాప్సి. ఈ కామెంట్స్ చూస్తుంటే, ఆమె పరోక్షంగా ఇలియానాను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్టు కనిపిస్తోంది.
బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియాస్ బోతో దాదాపు 9 ఏళ్లుగా డేటింగ్ చేస్తోంది తాప్సి. అతడ్నే పెళ్లి చేసుకుంటుందా లేదా అనే విషయంపై క్లారిటీ లేదు కానీ, తాజా స్టేట్ మెంట్ చూస్తుంటే, తాప్సి కూడా గర్భందాల్చిన తర్వాతే పెళ్లి చేసుకునేలా ఉంది.
త్వరలోనే ఆమె ట్విట్టర్, ఇనస్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాల నుంచి బయటకొచ్చే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో అంతా విషం చిమ్ముతున్నారని, ఎవరో ఒకర్ని తిడుతున్నారని, అందుకే తనకోసం, తన అభిమానుల కోసం, తనలాంటి మైండ్ సెట్ ఉన్న ప్రజల కోసం తాప్సి క్లబ్ డాట్ కామ్ ను స్థాపించబోతున్నట్టు వెల్లడించింది ఈ హీరోయిన్.