తనపై అనుచితంగా మాట్లాడిన కంగనా రనౌత్ సోదరి రంగోళీకి గట్టిగానే రివర్స్ పంచ్ ఇచ్చింది తాప్సీ. నటిగా దూసుకుపోతున్న తాప్సీని ఉద్దేశించి రంగోళీ తక్కువ చేసే కామెంట్లు చేసింది. తన సోదరి కంగనాను తాప్సీ అనుకరిస్తోందని రంగోళీ చెప్పుకొచ్చింది. అంతటితో ఆగకుండా కామెంట్లు కూడా చేసింది.
కంగనాకు తాప్సీ ఒక 'సాస్తా' కాపీ అని రంగోళీ వ్యాఖ్యానించింది. కంగనా కన్నా తాప్సీ చాలా తక్కువ స్థాయి నటి అని, ఆమె కంగనాను అనుకరిస్తోందంటూ కంగనా ఈ వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యల పట్ల తాప్సీ ఘాటుగా స్పందించలేదు కానీ, రంగోళీకి పంచ్ ఇచ్చినట్టుగా మాట్లాడింది.
' ఆ పోలికను తప్పు పట్టను. ఒక ఉత్తమ స్థాయి నటి తోనే నన్ను పోల్చారు. కాబట్టి ఆ పోలిక పట్ల నేను బాధపడటం లేదు..' అని తాప్సీ వ్యాఖ్యానించింది. అయితే తనను 'సాస్తా కంగనా రనౌత్' అని అనడం పట్ల మాత్రం తాప్సీ ఘాటుగా రియాక్ట్ అయ్యింది.
'ఔను నేను సస్తీ కంగనానే ఎందుకంటే, నేను అంత భారీ పారితోషకం తీసుకోను..' అని అంటూ తాప్సీ పవర్ పంచ్ ఇచ్చింది. కంగనా భారీ పారితోషకం తీసుకుంటుందని, తను అలా కాదంటూ రంగోళీ కామెంట్ కు తగిన సమాధానం ఇచ్చింది తాప్సీ.