cloudfront

Advertisement


Home > Movies - Movie News

తాప్సీ ఇది ఓవర్ గా లేదా?

తాప్సీ ఇది ఓవర్ గా లేదా?

తమను తాము ఫెమినిస్టులుగా నిరూపించుకోవడానికి కొంతమంది తాపత్రయపడుతూ ఉంటారు. ఈ జాబితాలో తాప్సీ కూడా తను ఉన్నట్టుగా హాజరు వేయించుకుంటూ ఉంటుంది. వాస్తవానికి ఈ హీరోయిన్లు ఫెమినిజం గురించి మాట్లాడటమే బిగ్ జోక్. అది ఎందుకో అందరికీ తెలుసు.

ఆ సంగతలా ఉంటే.. 'కబీర్ సింగ్' సినిమాను విమర్శించేసి తను కూడా ఫెమినిస్టుగా ఇంకో స్టెప్ పైకి ఎదగాలని తాప్సీ తాపత్రయ పడింది. అందుకోసమని ఒక రియల్ మర్డర్ మీద అనుచితంగా స్పందించింది తాప్సీ. ఇటీవల సందీప్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యల మీద తాప్సీ వ్యంగ్యంగా స్పందించాలని అనుకుంది. అందుకోసం ఒక రియల్ మర్డర్ ను ప్రస్తావించింది.

ఒకడెవడో తను ప్రేమించిన అమ్మాయిని చంపిన వార్తను పట్టుకుని..ఆ హత్యకూ సందీప్ రెడ్డి వంగా వ్యాఖ్యలకు ముడిపెట్టేసింది తాప్సీ. ఇద్దరు ప్రేమికులు చేయి చేసుకోకపోతే అది ప్రేమే కాదన్నట్టుగా సందీప్ వ్యాఖ్యానించాడు. ఆ వ్యాఖ్యలను ఆ హత్యకు అన్వయించింది తాప్సీ!

సందీప్ చేసిన వ్యాఖ్యలకూ ఒక సైకో ప్రేమికుడు చేసిన హత్యకూ ఏమైనా సంబంధం ఉందా? అయినా ఏదో లాజిక్ తో తాప్సీ ట్వీట్ వేసింది. ఆమె ఫాలోయర్లే ఈ విషయంలో మండిపడ్డారు. నువ్వు మాట్లాడేదాంట్లో ఏమైనా మీనింగ్ ఉందా? అని ఫాలోయర్లు ప్రశ్నించారు. చాలా టూమచ్ చేసిన తాప్సీని ఆ రీతిన ఆడుకున్నారు ఫాలోయర్లు.

ఒక సినిమాకూ, ఒక రియల్ మర్డర్ కు ముడిపెట్టిన తాప్సీ విమర్శల పాలవుతూ ఉంది. తన ట్వీట్ అర్థం చేసుకోవాలంటే అదేదో సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలన్నట్టుగా మరో ట్వీట్ పెట్టింది. ఇక్కడ తాప్సీ మరింత చిక్కుబడిపోయింది. ఒక అమ్మాయిపై జరిగిన దాడిని, తన హ్యూమర్ ను చాటుకునేందుకు తాప్సీ వినియోగించుకోవడం మరింత విమర్శలకు దారితీస్తోంది!

పరిటాల సునీతకు కోరుకున్నది దక్కింది.. ఉంటారా?