Advertisement

Advertisement


Home > Movies - Movie News

త్రీ..స్ మార్ ఖాన్

త్రీ..స్ మార్ ఖాన్

స్టూడెంట్..రౌడీ..పోలీస్ ఇలా మూడు వేరియేషన్లు వున్న పాత్రలో నటిస్తున్నాడు హీరో ఆది సాయి కుమార్. తీస్ మార్ ఖాన్ అనే ఈ సినిమా ట్రయిలర్ ను విడుదల చేసారు. పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను అవుట్ అండ్ అవుట్ మాస్ ఆడియన్స్ టార్గెట్ గా రూపొందించినట్లు కనిపిస్తోంది. 

పంచ్ డైలాగులు, సిక్స్ ప్యాక్ బాడీ, అమ్మాయిల అందాలు, వీటన్నింటి మధ్య హీరో విలన్ల సవాళ్లు ప్రతి సవాళ్లు ఇలా రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ దాటకుండా ఙాగ్రత్త పడ్డారు.

ఆది సాయికుమార్ కు మొదటి నుంచీ మాస్ సినిమాలు అంటే మహా ఇష్టం. దానికి కొనసాగింపుగా కనిపిస్తోంది ఈ తీస్ మార్ ఖాన్ ట్రయిలర్. విజ‌న్ సినిమాస్ బ్యానర్ మీద నాగం తిరుపతి రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. గతంలో నాటకం వంటి విభిన్నమైన సినిమాను అందించిన కళ్యాణ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ నెల 19న ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది.

రెండు నిమిషాల 42 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్ లో ప్రతి సన్నివేశం కూడా సినిమాకు బాగానే ఖర్చు చేసినట్లు క్లారిటీ ఇస్తోంది. తల్లి మీద వున్న అపారమైన ప్రేమ సినిమాకు అసలు థ్రెడ్ గా చూపించారు.

పోలీస్ గా ఆది సాయి కుమార్ ఎలివేషన్ హైలైట్ చేస్తూనే కామెడీ పండించడం ఆసక్తికరంగా మారింది. గతంలో ఎన్నడూ అతగాడు చేయని విధంగా ఈ పోలీస్ రోల్ ఉండబోతోందని స్పష్టమయింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?