తేజ అంతే.. ఆ సినిమా కూడా ఆగిపోయిందంతే!

బహుశా తేజ కెరీర్ లో ఆగినన్ని సినిమాలు మరే దర్శకుడి ఖాతాలో ఉండవేమో. ఎప్పటికప్పుడు ఇతడి దర్శకత్వంలో రావాల్సిన సినిమాలు ఆగిపోతుంటాయి.  Advertisement మొన్నటికిమొన్న వెంకటేష్ హీరోగా రావాల్సిన సినిమా ఆగిపోయింది. ఆ మూవీకి…

బహుశా తేజ కెరీర్ లో ఆగినన్ని సినిమాలు మరే దర్శకుడి ఖాతాలో ఉండవేమో. ఎప్పటికప్పుడు ఇతడి దర్శకత్వంలో రావాల్సిన సినిమాలు ఆగిపోతుంటాయి. 

మొన్నటికిమొన్న వెంకటేష్ హీరోగా రావాల్సిన సినిమా ఆగిపోయింది. ఆ మూవీకి సంబంధించి ఫొటో షూట్ కూడా చేసిన తర్వాత ప్రాజెక్టు ఆగిపోవడం వెంకీ అభిమానులకు నిరాశ కలిగించింది. ఇప్పుడీ లిస్ట్ లోకి గోపీచంద్ సినిమా కూడా చేరింది.

అవును.. తేజ-గోపీచంద్ కాంబోలో రావాల్సిన సినిమా ఆగిపోయింది. ఈ ప్రాజెక్టుకు అలివేలుమంగ వేంకటరమణ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశాడు తేజ. నెరేషన్ కూడా పూర్తయింది. గోపీచంద్ కూడా ఓకే చెప్పేశాడు. కానీ ప్రాజెక్టు ఆగిపోయింది. కారణం ఏంటనేది తేజకే తెలియాలి.

ఈ కథలో హీరోయిన్ కోసం తేజ చేయని ప్రయత్నం లేదు. అనుష్క నుంచి స్టార్ట్ చేసి సమంత, సాయిపల్లవి, కీర్తిసురేష్ ఇలా చాలామంది కోసం వెదికాడు. ఫైనల్ గా కీర్తిసురేష్ ను ఫైనల్ చేసినట్టు ఆమధ్య వార్తలు కూడా వచ్చాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే పీపుల్ మీడియా బ్యానర్ పై సినిమా రావాలి. అంతలోనే ఈ ప్రాజెక్టు ఆగిపోయింది.

ఈ సినిమాను ఎనౌన్స్ చేసిన టైమ్ లోనే రానాతో కూడా ఓ సినిమా ప్రకటించాడు తేజ. ఆ ప్రాజెక్టుకు రాక్షసరాజు రావణాసురుడు అనే టైటిల్ కూడా పెట్టాడు. కట్ చేస్తే, ఇప్పుడా ప్రాజెక్ట్ గురించి అటు రానా మాట్లాడ్డం లేదు, ఇటు తేజ పలకడం లేదు. 

ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రానా తన చేతిలో మిలింద్ రావు సినిమాతో పాటు గుణశేఖర్ తో చేయాల్సిన హిరణ్యకశిప మాత్రమే ఉందని ప్రకటించాడు.