Advertisement

Advertisement


Home > Movies - Movie News

దాదాపు మళ్లీ అదే జానర్ లో తేజ సినిమా

దాదాపు మళ్లీ అదే జానర్ లో తేజ సినిమా

హనుమాన్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు తేజ సజ్జ. ఈ ఏడాది సంక్రాంతి బరిలో బిగ్గెస్ట్ హిట్ ఈ సినిమానే. ఆ సినిమా థియేటర్లలోకి వచ్చి 4 నెలలైనా ఇప్పటివరకు తన కొత్త సినిమా సంగతులు వెల్లడించలేదు ఈ హీరో. ఎట్టకేలకు తేజ సజ్జ కొత్త సినిమా సంగతులు బయటకొచ్చాయి.

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా సినిమా చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడిదే ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించింది పీపుల్ మీడియా సంస్థ.

హనుమాన్ లో సూపర్ హీరోగా కనిపించిన తేజ సజ్జా, ఈ సినిమాలో కూడా దాదాపు అదే పాత్రలో సూపర్ యోధాగా కనిపించబోతున్నాడు. దీనికి సంబందించి ప్రీ-లుక్ కూడా రిలీజ్ చేశారు.

ఈ సినిమా టైటిల్ ను 18న వెల్లడిస్తారు. అదే టైమ్ లో ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాల్ని కూడా బయటపెడతారు. ఈ యాక్షన్ ఎడ్వెంచర్ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్ గా నటించనుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?