ఓ బేబీ, జాంబిరెడ్డి సినిమాలు ఇచ్చిన ఊపుతో చకచకా సినిమాలు చేస్తున్న యంగ్ హీరో తేజ సజ్జా.
జాంబిరెడ్డి డైరక్టర్ ప్రశాంత్ వర్మతో హనుమన్ సినిమా స్టార్ట్ చేసిన తేజ లేటెస్ట్ గా మరో సినిమా కూడా స్టార్ట్ చేసాడు.
ఈ సినిమా టైటిల్ ను లుక్ ను హీరో నాని విడుదల చేసారు. శివాని రాజశేఖర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు అద్భుతం అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు.
చంద్రశేఖర్ మొగుళ్ల నిర్మాతగా మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు ప్రశాంత్ వర్మ కథ అందించడం విశేషం.
అద్భుతం అనే టైటిల్ కి తగ్గట్లుగానే ఈ ఫస్ట్ లుక్ ని వినూత్నంగా సిద్ధం చేశారు దర్శకుడు మల్లిక్ రామ్, మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని నిర్మాత చంద్రశేఖర్ తెలిపారు.