హనుమాన్ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ వర్మ సత్తా తెలిసింది. హీరో తేజ సజ్జా స్థాయి పెరిగింది. ప్రశాంత్ వర్మకు గతంలోనే బాలయ్య సినిమా ఆఫర్ వుంది. నిర్మాత దానయ్య కుమారుడు కళ్యాణ్ తో మరో సూపర్ హీరో సినిమా అధీరా అనౌన్స్ మెంట్ జరిగిపోయింది. ఇప్పుడు హనుమాన్ సిరీస్ లో జై హనుమాన్ అనౌన్స్ మెంట్ వచ్చింది.
ప్రశాంత్ వర్మ తన ఇంటర్వూల్లో చాలా సార్లు చెప్పారు. పురాణ పాత్రల ఆధారంగా నాలుగైదు సూపర్ హీరో పాత్రలను సృష్టించి, వాటన్నింటిని ఓకే సినిమాలోకి తెచ్చి, ముగిస్తానని చెప్పారు. అంటే ఇప్పుడు అధీరాలో కావచ్చు, జై హనుమాన్ లో కావచ్చు కొత్త సూపర్ హీరో పాత్రలు వస్తాయి. ప్రశాంత్ వర్మ-బాలయ్య కాంబినేషన్ ఏనాడో ఫిక్స్ అయింది. అది ఎప్పుడు ఏమిటి అన్నది మాత్రం తెలియదు.
ఇదిలా వుంటే హనుమాన్ తో తన స్థాయిని పెంచుకున్న హీరో తేజ సజ్జా. ఇప్పుడు తన తరువాత సినిమా ఏమిటి? ఇప్పటికే పీపుల్స్ మీడియాలో కార్తీక్ ఘట్టమనేనితో ఓ సినిమా ఫినిష్ చేసి వున్నాడు. మరో సినిమా ఏమిటి? దర్శక.. రచయిత జోడీ బెజవాడ ప్రసన్న-నక్కిన త్రినాధరావు కాంబినేషన్ లో ఒక సినిమా వుంది అనే టాక్ వచ్చింది.
కానీ చిన్న హీరోలు వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వుంటేనే పెద్ద హీరోలుగా మారతారు. చిన్న హీరోలు కూడా పెద్ద హీరోలు చేసే రెగ్యులర్ ఫార్మాట్ మాస్ మసాలా ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు చేస్తే జనం యాక్సెప్ట్ చేయరు. ఆదికేశవ వ్యవహారం మాదిరిగానే వుంటుంది.
అందువల్ల నక్కిన త్రినాధరావుతో రెగ్యులర్ సినిమా చేసే కన్నా, మళ్లీ సరైన ప్రాజెక్ట్ ఎంచుకోవడం తేజ సజ్జాకు అవసరం. విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం జై హనుమాన్ లో తేజ సజ్జా వుండడు అని తెలుస్తోంది. అలా వుంటే వేరే లెవెల్. కాదు కనుక తేజ సజ్జా మంచి యంగ్ డైరక్టర్లతో వైవిధ్యమైన ప్రాజెక్ట్ ఎంచుకోవడం అత్యవసరం. తొందరపడి ఏ ప్రాజెక్ట్ కళ్ల పడితే ఆ ప్రాజెక్ట్ ఓకె చేస్తే కెరీర్ ముప్పు వస్తుంది.