తెలంగాణ ఎగ్జిబిటర్ల కొత్త నిర్ణయాలు

థియేటర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మూత పడుతున్నాయి. నిర్వహణ కష్టంగా వుంది.. అనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ఎగ్జిబిటర్ల సంఘం సమావేశం ఈ రోజు జరిగింది. సినిమాలు ఏ విధంగా షేరింగ్ మీద ప్రదర్శించాలి…

థియేటర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మూత పడుతున్నాయి. నిర్వహణ కష్టంగా వుంది.. అనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ఎగ్జిబిటర్ల సంఘం సమావేశం ఈ రోజు జరిగింది. సినిమాలు ఏ విధంగా షేరింగ్ మీద ప్రదర్శించాలి అనే దాని మీద కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. నైజాంలో సినిమాను కొన్న రేటు ప్రాతిపదికగా తొలివారం, మలి వారం, ఆ పై వారం, నాలుగోవారం కలెక్షన్లను ఎలా పంచుకోవాలి అన్నది డిసైడ్ చేసారు.

ముఫై కోట్లకు పైబడిన రేటుకు నైజాంలో కొన్న సినిమాలకు తొలివారం బయ్యర్ కు 75శాతం ఎగ్జిబిటర్ కు 25శాతం వుండాలని, రెండో వారం 55 శాతం.. 45 శాతంగా వుండాలని, ఆ తరువాత వరుసగా 40-60, 30-70 శాతం లెక్కన పంపిణీ వుంటుంది.

10 కోట్ల నుంచి 30 కోట్ల రేటుకు నైజాంలో కొన్న సినిమాలకు తొలివారం బయ్యర్ కు 60 శాతం ఎగ్జిబిటర్ కు 40 శాతం లెక్కన పంపిణీ చేస్తారు. మలివారం 50-50, మూడోవారం 40-60, నాలుగోవారం 30-70 శాతం లెక్కన షేర్ చేసుకుంటారు

10 కోట్ల లోపు సినిమాలకు తొలివారం 50శాతం 50 శాతం వంతున బయ్యర్లకు, ఎగ్జిబిటర్లకు పంపిణీ చేస్తారు. రెండో వారం 40-60, మూడోవారం 30-70 వంతున ఆదాయం పంచుకుంటారు.

సినిమా రంగ పెద్దలు శిరీష్, సునీల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఇదిలా వుంటే ఇప్పటకే నైజాం డీల్స్ జరిగిపోయిన ప్రాజెక్ట్ కె, పుష్ప2, గేమ్ ఛేంజర్, ఇండియన్ 2 సినిమాలకు ఈ కొత్త అగ్రిమెంట్ వర్తించదని సంఘ ప్రతినిధి శ్రీధర్ తెలిపారు.