నైజాంలో కల్కి టికెట్ రేట్లు ఇలా..?

పెద్ద సినిమాలు రిలీజ్ అయితే టికెట్ రేట్లు పెంచడం కామన్ గా మారింది. కల్కి వస్తోంది కాబట్టి ఆటోమేటిగ్గా టికెట్ రేట్లు పెరిగాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రత్యేక జీవో వచ్చింది.…

పెద్ద సినిమాలు రిలీజ్ అయితే టికెట్ రేట్లు పెంచడం కామన్ గా మారింది. కల్కి వస్తోంది కాబట్టి ఆటోమేటిగ్గా టికెట్ రేట్లు పెరిగాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రత్యేక జీవో వచ్చింది.

27న రిలీజ్ అవ్వబోతున్న కల్కి సినిమాకు స్పెషల్ షో వేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఉదయం 5.30కు కల్కి స్పెషల్ షోలు పడబోతున్నాయి. ఈ షో కోసం టికెట్ రేటును 200 రూపాయలు (జీఎస్టీతో కలిపి) పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.

ఇక అదనపు షోల విషయానికొస్తే.. 27వ తేదీ నుంచి 8 రోజుల పాటు రోజుకు 5 షోలు వేసుకునేందుకు ప్రత్యేక అనుమతి ఇచ్చింది తెలంగాణ సర్కారు. ఈ 8 రోజులు టికెట్ పెంపు ఉంటుంది. సింగిల్ స్క్రీన్స్ లో 75 రూపాయలు, మల్టీప్లెక్సుల్లో 100 రూపాయలు పెంపునకు అనుమతి వచ్చింది.

మిడ్-నైట్ షోలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. ఆ టైమ్ కు ఎక్కడికక్కడ స్థానికంగా అనుమతులు తీసుకునే అవకాశం ఉంది. ఇక స్పెషల్ షోల విషయానికొస్తే, నైజాంలోని దాదాపు ప్రతి మెయిన్ సెంటర్ లో ఉదయం 5.30 ఆట పడబోతోంది.

పెంచిన టికెట్ రేట్ల ప్రకారం చూసుకుంటే, హైదరాబాద్ లోని చాలా మల్టీప్లెక్సుల్లో రీక్లైనర్ సీట్ల రేట్లు 500 రూపాయలకు పైగా ఉండబోతున్నాయి. ఇక దాని కింద ఉండే సాధారణ సీట్ల ధరలు 350 నుంచి 375 రూపాయలు ఉండే అవకాశం ఉంది. సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ రేట్లు 250 రూపాయల వరకు ఉంటాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి జీవో ఇంకా రావాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కల్కి సినిమాకు సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్సులతో సంబంధం లేకుండా ఫ్లాట్ గా 100 రూపాయలు పెంచే అవకాశం ఉందంటున్నారు.