థమన్.. గెట్ రెడీ

మహేష్-త్రివిక్రమ్‌ల గుంటూరు కారం సినిమా నుంచి పాట వస్తోంది. ఫ్యాన్స్ కాదు రెడీగా వుండాల్సింది. సంగీత దర్శకుడు థమన్. ఎందుకంటే ఇటీవల చాలా సినిమాల నుంచి థమన్ అందిస్తున్న బ్యాక్ గ్రవుండ్ స్కోర్, పాటలు…

మహేష్-త్రివిక్రమ్‌ల గుంటూరు కారం సినిమా నుంచి పాట వస్తోంది. ఫ్యాన్స్ కాదు రెడీగా వుండాల్సింది. సంగీత దర్శకుడు థమన్. ఎందుకంటే ఇటీవల చాలా సినిమాల నుంచి థమన్ అందిస్తున్న బ్యాక్ గ్రవుండ్ స్కోర్, పాటలు తరచు విమర్శలకు ట్రోలింగ్ కు గురవుతున్నాయి. ఈ ట్రోలర్స్ మీద థమన్ తీవ్ర అసహనం ఓపెన్ గానే వ్యక్తం చేసారు కూడా. 

ఇలాంటి నేపథ్యంలో గుంటూరు కారం సాంగ్ ప్రోమో వస్తోంది. దీని మీద చాలా ఆశలు వున్నాయి. ఎవరితో థమన్ వర్క్ ఎలా వున్నా, త్రివిక్రమ్ తో వేరే లెవెల్ లో వుంటుందనే ఆశలు అందరికీ వున్నాయి. త్రివిక్రమ్ కాంబినేషన్ లో కూడా థమన్ ఏమీ గొప్పగా చేయలేకపోయినా, కాపీ ముద్ర పడినా ట్రోలింగ్ చాలా దారుణంగా వుంటుంది.

నిజానికి ఈ ప్రోమో లాంటిది ముందే లీక్ అయింది. కొన్ని సెకెండ్ల బిట్ బయటకు వచ్చేసింది. వచ్చిన బిట్ మీద అయితే ఫ్యాన్స్ ఏమీ పెద్దగా సంతృప్తిగా లేరు. అయితే. అది మరీ బేసిక్ రఫ్ వెర్షన్. అందువల్ల రేపు రాబోయే ప్రోమోనే డిసైడ్ చేస్తుంది పాట ఎలా వుండబోతోందో. రామజోగయ్య శాస్త్రి దమ్ మసాలా, అరకోడి, బిరియానీ మసాలా అంటూ మాంచి ఘాటైన మసాలా సాంగ్ అందించారు. దానికి సరైన ట్యూన్, వాయిస్ సెట్ కావాలి.

ఈ విషయంలో బాగుంటే బ్రేక్ ఇవ్వడానికి ఫ్యాన్స్ రెడీ. లేదంటే ట్రోలింగ్ ఎదుర్కోవడానికి థమన్ రెడీగా వుండాలి.