బ్రో సినిమాకు సంబంధించి సంగీత దర్శకుడు థమన్ విపరీతమైన ట్రోలింగ్ ను ఎదుర్కొన్నారు. సరైన పాటలు ఇవ్వలేదన్నది పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం. అదే టైమ్ లో సరైన పాటలు ఇవ్వలేదు కనుక, గుంటూరు కారం సినిమాకు థమన్ వద్దంటూ మహేష్ ఫ్యాన్స్ డిమాండ్. ఇలా అన్ని విధాలా థమన్ కార్నర్ అయ్యారు.
అదే బ్రో సినిమాకు తెరవెనుక కర్త..కర్మ..క్రియ త్రివిక్రమ్. ఆ సినిమాను సెట్ చేసింది, తమిళ సినిమా కథను కమర్షియల్ టచ్ ఇచ్చి మార్చింది. ముందుగా అనుకున్న బుర్రా సాయి మాధవ్ ను కాదని తానే చేయి చేసుకుని మాటలు అందించింది..అన్నింటికి మించి ఈ ప్రాజెక్ట్ ను ‘సెట్’ చేసింది త్రివిక్రమ్ నే. ఇందుకు గాను దాదాపు 15 కోట్లు ప్లస్ లాభాల్లో పావలా వాటా తీసుకున్నారని టాలీవుడ్ లో వినిపిస్తూనే వుంది.
స్క్రీన్ ప్లే, మాటలకు 15 కోట్లు పారితోషికం అన్నది టాలీవుడ్ లోనే కనీ వినీ ఎరుగని రెమ్యూనిరేషన్. కానీ ఈ రోజు విడుదలైన ట్రయిలర్ చూస్తే ఒక్కటంటే ఒక్కటి త్రివిక్రమ్ మార్క్ డైలాగు లేదు. త్రివిక్రమ్ ను గుర్తు చేసే జీవిత సత్యాలు లేవు.. త్రివిక్రమ్ స్టయిల్ స్పార్క్.. మార్క్ లేదు.
సాధారణంగా సినిమాలో వున్న ది బెస్ట్ అనుకున్నవి ట్రయిలర్ లోకి తెస్తారు. మరి అలాగే తెచ్చి వుంటే సినిమాలో డైలాగుల మీద కాస్త అనుమానం కలుగుతుంది.
పాటల యావరేజ్ గా వుంటే థమన్ ఆడేసుకున్న పవన్, మహేష్ ఫ్యాన్స్, మరి త్రివిక్రమ్ విషయంలో మాత్రం సైలంట్ అయ్యారు.