టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తున్న గ్యాసిప్ ఇది. మహేష్ బాబు-త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమా నుంచి థమన్ ను తప్పిస్తున్నట్లు తెలుస్తోంది.
థమన్ స్దానంలో జివి ప్రకాష్ కుమార్ ను తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఈ సినిమా ఆరంభం నుంచీ థమన్ విషయంలో డవుట్లు వినిపిస్తూనే వున్నాయి. విదేశాల్లో మహేష్ వున్నపుడు అక్కడకు థమన్ వస్తా అంటే కూడా హీరో ఒప్పుకోలేదని, దాంతో లాస్ట్ మినిట్ లో థమన్ డ్రాప్ అయ్యాడనీ అప్పట్లో వార్తలు వినిపించాయి.
అయితే త్రివిక్రమ్ పట్టు పట్టి హీరోను ఒప్పించగలిగారు. ఆ తరువాత అంతా సమసిపోయింది. కానీ ఇప్పుడు మళ్లీ కొత్తగా గ్యాసిప్ లు వినిపించడం ప్రారంభమైంది. ఇటీవల గుంటూరు కారం టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో కి థమన్ ఇచ్చిన వర్క్ మీద కూడా ఫ్యాన్స్ పూర్తిగా సంతృప్తిగా అయితే లేరు.
ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి థమన్ ఒకే ఒక ట్యూన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అది కూడా హీరోకి నచ్చలేదని బోగట్టా. దాంతో ఓ వారం రొజుల్లో ట్యూన్ లు ఇస్తే సరేసరి లేదంటే ఆల్టర్ నేటివ్ చూడమని హీరో చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు మరి నిర్ణయం తీసుకున్నారో? తీసుకుంటారో? క్లారిటీ లేదు కానీ జి వి ప్రకాష్ కుమార్ పేరు మాత్రం వినిపిస్తోంది. బహశా ఒకటి రెండు రోజుల్లో థమన్ నే వుంటారా? జివి ప్రకాష్ కుమార్ వస్తారా? అన్నది తెలిసిపోవచ్చు.