థాంక్యూ కోసం ఎన్ని జాగ్రత్తలో!

నిర్మాత దిల్ రాజు మంచి వ్యూహకర్త. తన సినిమాలను ఎలా బతికించుకోవాలో..ఎలా గట్టెక్కించుకోవాలో బాగా తెలుసు. ఎఫ్ 3 సినిమా విషయంలో రేట్లు తగ్గించి, వీలయినంత ప్లాన్డ్ గా థియేటర్లు పెట్టి సినిమాను నిలబెట్టుకున్నారు.…

నిర్మాత దిల్ రాజు మంచి వ్యూహకర్త. తన సినిమాలను ఎలా బతికించుకోవాలో..ఎలా గట్టెక్కించుకోవాలో బాగా తెలుసు. ఎఫ్ 3 సినిమా విషయంలో రేట్లు తగ్గించి, వీలయినంత ప్లాన్డ్ గా థియేటర్లు పెట్టి సినిమాను నిలబెట్టుకున్నారు. ఇప్పుడు వస్తున్న చైతన్య-విక్రమ్ కుమార్ కాంబినేషన్ థాంక్యూ విషయంలో అంతకు మించి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్నింటికి కన్నా ముందుగా సినిమాను డిస్ట్రిబ్యూషన్ కే ఇచ్చారు తప్ప అమ్మలేదు.

గతంలో కూడా ఇలాగే చేసారు. కానీ ఎఫ్ 3 ని మాత్రం ముందు ఏరియాల వారీ విక్రయించి, విడుదల రోజున మళ్లీ మనసు మార్చుకుని, బయ్యర్ల దగ్గర నుంచి తీసుకున్న మొత్తాలను అడ్వాన్స్ లుగా మార్చేసారు. థాంక్యూ విషయంలో మరి మరోసారి ఆ తప్పు చేయడం లేదు.

ఓవర్ సీస్ మాత్రం ఎప్పటి లాగే విక్రయించారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా ముందు అనుకున్న మొత్తం కన్నా 50 లక్షలు రేటు తగ్గించారు. ఓవర్ సీస్ వన్ మిలియన్ దగ్గరగా చేస్తే చాలు బ్రేక్ ఈవెన్ అవుతుందని తెలుస్తోంది. ఆ విధంగా ఓవర్ సీస్ లో బ్యాడ్ నేమ్ రాకుండా ముందే జాగ్రత్త పడ్డారు. సినిమా హిట్ అయితే ఓవర్ ఫ్లోస్ ఎలాగూ వస్తాయనే ధీమా వుంది కనుక.

సినిమా టికెట్ రేట్లను ఎఫ్ 3 కన్నా కూడా తగ్గించారు. ఈ మధ్యకాలంలో తెలంగాణలో 100 ప్లస్ జిఎస్టీ అన్న రేటు వినపడడం ఇదే. ఈ ప్లాన్ వర్కవుట్ అయితే మిగిలిన సినిమాలు కూడా ఈ దారి పడతాయేమో? పక్కా కమర్షియల్, ఇంకా మరి కొన్ని సినిమాలు దిల్ రాజే పంపిణీ చేసారు కానీ వాటికి తగ్గించలేదు. తన సినిమా కనుక తగ్గించేసారేమో?

ఇక సినిమా విడుదల డేట్ ను ఎలా సెట్ చేసుకున్నదీ ఇఫ్పటికే అనేక వార్తలు వచ్చాయి. మిగిలిన డేట్ లు అన్నింటా సినిమాలు కుమ్మేసుకుంటున్నాయి. కానీ 22ను మాత్రం సోలోగా వదిలేసాయి. అంటే అది దిల్ రాజు వ్యూహ రచన తప్ప వేరు కాదని అర్థం అవుతూనే వుంది.

ఇక బుక్ మై షో లో ముందుగా టికెట్ బుకింగ్ ఓపెన్ చేయడం లేదు. బహుశా బుధవారం సాయంత్రానికి కానీ గురువారం కానీ స్టార్ట్ చేసే అవకాశం వుంది. ముందుగా ఓపెన్ చేయడం, టికెట్ లు తెగడం లేదు అంటూ నెగిటివ్ ప్రచారం మొదలు కావడం అన్న పాయింట్ లేకుండా దిల్ రాజు జాగ్రత్త పడుతున్నట్లుంది.

సినిమా జానర్ ను కూడా క్లారిటీగా చెబుతూ వస్తోంది యూనిట్ కానీ దిల్ రాజు కానీ, ఫీల్ గుడ్ సినిమా. ఇలా వుంటుంది..ఇలా ఫీలవుతారు అని క్లారిటీగా చెప్పేస్తున్నారు. దాని వల్ల ఆ జానర్ నచ్చిన వాళ్లే ముందుగా సినిమాకు వస్తారు. దాని వల్ల డిస్సపాయింట్ మెంట్ వుండదనే ఆలోచన కావచ్చు.                    

మొత్తం మీద దిల్ రాజు థాంక్యూ సినిమాకు సకల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చైతన్య కు దిల్ రాజు ఫస్ట్ సినిమా ఇచ్చారు. కానీ అది హిట్ కాలేదు. చాలా గ్యాప్ తరవాత ఇది మలి సినిమా.