నయా ట్రెండ్ తో యూత్ బేజారెత్తిస్తున్నారు

యువతరం అంటేనే దూకుడు. పడిలేచే కడలితరంగంగా వారు ఉంటారు. వారి జోరుని అందుకోవడం ఎవరికైనా కష్టం. అలాంటి యువతరం ఇపుడు కొత్త ట్రెండ్ తో రోడ్ల మీద విన్యాసాలు చేస్తోంది. ప్రత్యేకింది వీకెండ్స్ లో…

యువతరం అంటేనే దూకుడు. పడిలేచే కడలితరంగంగా వారు ఉంటారు. వారి జోరుని అందుకోవడం ఎవరికైనా కష్టం. అలాంటి యువతరం ఇపుడు కొత్త ట్రెండ్ తో రోడ్ల మీద విన్యాసాలు చేస్తోంది. ప్రత్యేకింది వీకెండ్స్ లో విశాఖ బీచ్ రోడ్లు బైక్ రేసింగ్స్ తో మోతెక్కిపోతున్నాయి.

పదుల సంఖ్యలో బైకులు రొద చేస్తూ బీచ్ రోడ్డులో కిలోమీటర్లను సెకన్ల స్పీడ్ తో కిల్ చేస్తూ భయంకరమైన ఫీట్స్ చేస్తున్నాయి. యువతకు బైక్ రేసింగ్ పిచ్చి బాగా పట్టుకుందని పోలీసులు అంటున్నారు.

ఒకరిని చూసి మరొకరు అన్న చందంగా వీకెండ్స్ లో చేస్తున్న బైక్ రేసింగ్స్ తో స్మార్ట్ సిటీలో ప్రమాదాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పహారా పెట్టి మరీ ఇటీవల చాలా మందిని బైక్ రేసింగ్ చేస్తూండగా పట్టుకున్నారు.

ఇలా బైక్ రేసింగ్ చేసే 40 మందిని అరెస్ట్ చేసి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సీసీ పుటేజిల ఆధారంగా మరింతమందిని గుర్తించి అరెస్ట్ కి రంగం సిద్ధం చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. గతంలో కూడా వీకెండ్స్ బైక్ రేసింగ్స్ పెద్ద ఎత్తున సాగేవి. అయితే పోలీస్ నిఘా ఉంచడంతో అప్పట్లో ఆగాయి.

మళ్లీ ఇపుడు జోరందుకున్నాయి. ఈ బైక్ రేసింగ్స్ వల్ల మామూలుగా రోడ్డు మీద వెళ్ళే వారు సైతం ప్రమాదాలకు గురి అవుతున్నారు. ప్రత్యేక్సంగా ఇస్టాగ్రామ్ లో బైక్ రేసింగ్స్ ఫీట్స్ ని చూస్తూ ఫాలో అయ్యే యువతకు ఇదొక మత్తుగా ఆవహించింది. దీన్ని తొందరలోనే చిత్తు చేస్తామని విశాఖ పోలీసులు చెబుతున్నారు. ఈ అవాంఛ‌నీయ పరిణామాలకు తప్పకుండా అడ్డుకట్ట వేస్తామని కూడా స్పష్టం చేస్తున్నారు.