నారాయణ పదజాలం.. చిర్రెత్తిన చిరాభిమానం.!

చిరంజీవిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన CPI నారాయణ వెనక్కి తగ్గారు. వివాదం ఇక్కడితో ముగించాలని మెగా ఫ్యాన్స్‌ను కోరారు. మెగాస్టార్ కి సారీ చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని..  వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు…

చిరంజీవిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన CPI నారాయణ వెనక్కి తగ్గారు. వివాదం ఇక్కడితో ముగించాలని మెగా ఫ్యాన్స్‌ను కోరారు. మెగాస్టార్ కి సారీ చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని..  వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. 

తాను వాడిన పదాన్ని భాషా దోషంగా పరిగణిస్తున్నానని.. వివాదం వద్దని సూచించారు. చిరంజీవి రాజకీయ నేతగా ఉన్నారని..రాజకీయాల్లో విమర్శలను స్పోర్టివ్‌గా తీసుకోవాలని పేర్కొన్నారు. మెగా అభిమానులు ఈ వ్యాఖ్యల్ని మర్చిపోవాలని కోరారు.  

చిరంజీవి ఫ్యాన్స్, కాపు నాడు సభ్యులు కలిసి వరద బాధితులకు సాయం చేసేందుకు ముందుకు రావాలన్నారు. ఇటీవల చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ టార్గెట్‌గా కాస్త ఘాటు పదజాలం ఉపయోగించారు. ప్రధాని మోదీ హాజరైన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ వేదిక పైకి.. అల్లూరి సీతారామరాజుగా నటించిన కృష్ణను పిలవకుండా.. చిరును పిలవడాన్ని తప్ప పట్టారు. 

రాజకీయాల్లో రంగులు మార్చే చిరంజీవికి స్టేజ్‌పై ప్లేస్ తగదని.. చిల్లర బేరగాడు అంటూ కామెంట్స్ పేల్చారు. అలాగే పవన్ ఒక ల్యాండ్ మైన్ లాంటివాడని.. అది ఎప్పుడు పేలుతుందో ఎవరికీ తెలియదని చెప్పుకొచ్చారు.

కాగా నారాయణ చిరును టార్గెట్ చేయడంతో.. మెగా ఫ్యాన్స్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సోషల్ మీడియా వేదికగా పలు ఆయనకు వార్నింగ్స్ వచ్చాయి. పలు కాపు సంఘాలు కూడా నారాయణ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. 

పోలీస్ కంప్లైంట్స్ వరకు వెళ్లింది వ్యవహారం. మెగా బ్రదర్ నాగబాబు కూడా రెస్పాండ్ అయ్యారు. నారాయణకు గడ్డి తినడం మాన్పించి.. అన్నం తినడం నేర్పాలని తన మార్క్ కామెంట్స్ చేశారు. నారయణ లైన్ క్రాస్ చేశారని పలువురి నిపుణులు నుంచి విమర్శలు వచ్చాయి. దీంతో వెనక్కి తగ్గి.. తన కామెంట్స్ వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు నారాయణ.