రవితేజ…శరత్ మండవ..పనిలేని హ్యాండ్స్

కొత్త దర్శకుడు శరత్ మండవ. ఫుల్ జోష్ లో వున్నారు. ఫుల్ స్పీడ్ లో వున్నారు. ఆ స్పీడ్ లో, ఆ జోష్ లో ఆయన కామెంట్లు ఆయన పాస్ చేస్తున్నారు. దానికి హీరో…

కొత్త దర్శకుడు శరత్ మండవ. ఫుల్ జోష్ లో వున్నారు. ఫుల్ స్పీడ్ లో వున్నారు. ఆ స్పీడ్ లో, ఆ జోష్ లో ఆయన కామెంట్లు ఆయన పాస్ చేస్తున్నారు. దానికి హీరో రవితేజ వత్తాసు పలుకుతున్నారు. ఇంతకీ ఏమిటి విషయం. రామారావ్ ఆన్ డ్యూటీ సినిమా పారితోషికం విషయంలో నిర్మాత సుధాకర్ కు హీరోకు మధ్య పొరపొచ్చాలు వచ్చాయని గ్యాసిప్ లు కొంత కాలం కిందట వచ్చాయి. దాన్ని ప్రొడక్షన్ పబ్లిసిటీ కోసం ఏర్పాటు చేసుకున్న ఇంటర్వూలో యాంకర్ ప్రస్తావించింది.

దీనికి రవితేజ స్పందన ఆయన స్టయిల్ లోనే వుంది. ‘పనీ పాటా లేని బ్యాచ్ ఒకటి వుంటుంది. దానికి శరత్ ఏమని పేరు పెట్టాడంటే…ఐడిల్ హ్యాండ్స్…ఐడిల్ లెగ్స్ అని కూడా అనాలేమో? వీళ్లు అలా ఏదో రాస్తుంటారు..పట్టించుకోకూడదు…’ అనే టైపులో బదులు ఇచ్చారు.

సరే, రామారావ్ ఆన్ డ్యూటీ నిర్మాత సుధాకర్ కు ఇండస్ట్రీ మొత్తం మీదే మంచి వ్యక్తి, నెమ్మది, అజాతశతృవు అని పేరు వుంది. అది వాస్తవం. నిజంగానే చాలా నెమ్మదైన మనిషి. ఆయనతో రవితేజకు గొడవ వచ్చి వుండకపోవచ్చు. అంత మాత్రం చేత కొత్త దర్శకుడు శరత్ కానీ రవితేజ కానీ తమ నోటికి వచ్చినట్లు మాట్లాడేయకూడదు.

మొన్నటికి మొన్న ఏం జరిగిందో రవితేజ మరిచిపోయి వుండొచ్చు. ఖిలాడీ సినిమా విషయంలో కూడా ఇవే వార్తలు వచ్చాయి కదా? ఆఫ్ ది రికార్డుగా అయినా రవితేజ ఖిలాడీ నిర్మాత దగ్గర డబ్బులు ఎలా పిండి వసూలు చేసారో వినిపిస్తూనే వుంది ఇప్పటికీ కూడా. ముందు ఒప్పుకున్నది కొంత..తరువాత మార్చింది మరి కొంత..సినిమా విడుదలకు ముందు ఇంకొంత అన్నట్లు రవితేజ మాట మార్చారని ఖిలాడీ కీలక టెక్నీషియన్ నే మీడియాతో ఆఫ్ ది రికార్డు గా షేర్ చేసుకున్నారు. 

రవితేజ క్రాక్ పెద్ద హిట్ కావచ్చు. కానీ అంతకు ముందు తరువాత ఆయన సినిమా లు బడ్జెట్ పెరిగిపోవడం వల్ల నిర్మాతలు ఎంత ఇబ్బందులు పడింది వార్తలుగా వచ్చాయి కదా? అవన్నీ కూడా పనీ పాట లేని బ్యాచ్ పనేనా?

ఇలా రెమ్యూనిరేషన్ కోసం ఇబ్బంది పెడుతున్నారు అంటూ ఈ ‘ఐడిల్ హ్యాండ్స్’ కానీ, ‘పనీ పాటా లేని బ్యాచ్’ కానీ మరే హీరో మీద ఎందుకు రాయడం లేదు వార్తలు. ఇలాంటివార్తలు ఎక్కువగా రవితేజ మీదే ఎందుకు వస్తుంటాయి? అది కూడా ఆలోచించాలి కదా? రెమ్యూనిరేషన్ దగ్గర రవితేజ ఎలా వుంటారు అన్నది టాలీవుడ్ లో ఆయనతో సినిమా చేసిన యూనిట్ జనాలు రకరకాలుగా చెప్పుకుంటూ వుంటారు. వాళ్లు కూడా పనీ పాట లేని బ్యాచ్ యేనా?   

సరే రవితేజ అంటే సీనియర్ హీరో. ఏవేవో కామెంట్లు పాస్ చేసి వుండొచ్చు. కానీ ఒక్క సినిమా అనుభవం కూడా ఇంకా రాకుండానే దర్శకుడు శరత్ మండవ కూడా అదే దారి పడితే ఎలా? ఆయనకు మీడియాతో ఎంత అనుభవం వుందని కామెంట్లు, ట్యాగ్ లైన్లు ఫిక్స్ చేసేయడం? కాస్త ముందు వెనుక చూసుకుంటూ, తప్పించుకు తిరుగువాడు ధన్యడు సుమతీ అన్నట్లు వెళ్తే మంచిది కదా?