Advertisement

Advertisement


Home > Movies - Press Releases

‘దర్జా’గా థియేటర్ లో చూడండి

‘దర్జా’గా థియేటర్ లో చూడండి

కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ భారీగా జరిగింది. పలువురు సినిమా ప్రముఖులు ఈ ఫంక్షన్ కు హాజరయ్యారు. ఈ సినిమాలో కీలకపాత్ర నటించిన అనసూయ ఫంక్షన్ లో మాట్లాడుతూ అనసూయ మాట్లాడుతూ..

‘‘దర్జా మూవీ ని చాలా ఫ్యాషన్ తో నిర్మించారు. మంచి సినిమా అవుతుంది. ఈ సినిమాను థియేటర్ లోనే చూడండి. ఓటిటి కోసం వెయిట్ చేయొద్దు..’ అన్నారు. ఈ సినిమాకు సంబంధించి.. ఇప్పటి వరకు జరిగిన ఏ ప్రొమోషనల్ ఈవెంట్‌లోనూ భాగం కాలేదు. అందుకు టీమ్‌ని క్షమించమని అడుగుతున్నాను. అందుకు కారణం ఏమిటనేది యూనిట్‌కి చెప్పడం జరిగింది. నాతో పాటు ఈ సినిమాకు పని చేసిన సునీల్ , శిరీష, అక్సా, షమ్ము, సమీర్, షఫీ ఇలా అందరికీ ఆల్ ద బెస్ట్. అన్నారు.

కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌గా రవి పైడిపాటి వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూలై 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను సోమవారం హైదరాబాద్ తాజ్ డెక్కన్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిగ్ టికెట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ ఎర్నేని విడుదల చేసి.. చిత్ర సమర్పకుడు కామినేని శ్రీనివాస్‌కు అందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన అనసూయ, ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు, ‘గంధర్వ’ హీరో సందీప్ మాధవ్, దర్శకుడు వీరశంకర్, ఉత్తేజ్, చిట్టిబాబు, నాగమహేష్, షఫీ, కుమనన్ సేతురామన్, వెంపక శ్రీను, జర్నలిస్ట్ ప్రభులతో పాటు కరీంనగర్ సిటీ కమిషనర్ సత్యన్నారాయణ, ఐడీబిఐ బ్యాంక్ డిజిఎమ్స్ వి. ప్రదీప్ కుమార్, ఎస్‌సిఎమ్ శెట్టి, హము రమావత్, ఇంకా చిత్రబృందం పాల్గొంది.

నటుడు ఉత్తేజ్ మాట్లాడుతూ.. ‘‘.నేను కూడా ఈ మూవీ లో ఓ పాట పాడాను. ఆ పాటలోనా కుమార్తె  కూడా  భాగమైంది. ఈ సినిమాని నేను 75 శాతం చూడటం జరిగింది. ఇది బెస్ట్ ఫిల్మ్ కాబోతోందన్నారు.

నటుడు షఫీ మాట్లాడుతూ.. ‘‘కొత్త టీమ్ చేసిన ఈ ప్రాజెక్ట్ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అనసూయగారు ఆసనంపై ‘దర్జా’గా కూర్చున్నారు. పోస్టర్ చాలా బాగుంది. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని రషెస్ చూశాను. సినిమా మంచి విజయం సాధించి నిర్మాతలకు మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాను..’’ అన్నారు.

కరీంనగర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సత్యన్నారాయణ మాట్లాడుతూ.. ‘‘సినిమా అంటే సమాజంపై చాలా ప్రభావం చూపే మాధ్యమం. అందుకే దానికి అంత క్రేజ్. అందరికీ వినోదాన్ని పంచడంలో సినిమాని మించింది లేదు. ఈ సినిమాని మా గ్రామానికి చెందిన వ్యక్తి నిర్మించినందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమాపై పెద్ద పెద్ద విజయం సాధించిన సినిమాల్లో నటించిన వారు నటించారు. ఈ సినిమా ఘన విజయం సాధించి.. నిర్మాతలకు మరిన్ని మంచి చిత్రాలను నిర్మించేందుకు మార్గం కావాలని కోరుకుంటున్నాను..’’ అన్నారు.

హీరో సందీప్ మాధవ్ మాట్లాడుతూ.. ‘‘ట్రైలర్స్, సాంగ్స్ చూస్తుంటే ఈ సినిమా చాలా బాగా వచ్చినట్లు అనిపిస్తుంది. చాలా మంచి కంటెంట్ ఇందులో ఉన్నట్లుగా తెలుస్తుందన్నారు.

సంగీత దర్శకుడు ర్యాప్ రాప్ షకీల్ మాట్లాడుతూ.. ‘సినిమా చూసి థియేటర్ ‌నుండి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ అనసూయ గురించి, సునీల్ గురించి తర్వాత డైరెక్టర్ గురించి, ఆ తర్వాత బీజీఎమ్ గురించే మాట్లాడతారు.’ అని అన్నారు.

దర్శకుడు సలీమ్ మాలిక్ మాట్లాడుతూ.. ‘‘దర్జా అంటే రాయల్టీ. స్ర్కీన్‌ప్లే బేస్డ్ స్టోరీ. దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఇటువంటి కథ తెరపైకి వచ్చిందని చెప్పగలను. జూలై 22న థియేటర్లకి వెళ్లి ‘దర్జా’గా ఈ సినిమా చూడండి అన్నారు.

నిర్మాత కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘ నాకు సినిమా ప్రొడక్షన్ గురించి ఏమీ తెలియదు. సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తాను కానీ.. ప్రొడక్షన్ పరంగా ఏమీ తెలియదు. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో నాకు నిర్మాతలు, దర్శకులు, నటీనటులు తెలిసిన వాళ్లు ఎందరో ఉన్నారు. నిర్మాత శివశంకర్ ఏది అడిగితే అది చేసిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. తప్పకుండా ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను..’’ అని అన్నారు.

దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ.. మొట్టమొదటి చిత్రం చేస్తున్న దర్శకుల చిత్రాలు ఖచ్చితంగా హిట్టవ్వాలి. అలా హిట్ అయితేనే ఇంకో 10 మంది నిర్మాతలు అతనితో సినిమా తీయడానికి ముందుకొస్తారు. రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో డబ్బులు ఎక్కువ వస్తాయేమో తెలియదు కానీ.. సినిమాపై ప్యాషన్‌తో వచ్చి ఇలా సినిమాలు నిర్మించడం మాత్రం చాలా గొప్ప విషయం. ఎందుకంటే డబ్బులు వస్తాయో, రావో తెలియదు.. అయినా ప్యాషన్‌తో సినిమాలు చేస్తుంటారు. అందుకే మొదటి ప్రయత్నం చేస్తున్న ఈ సినిమా నిర్మాతలకు మంచి హిట్ రావాలి. ’ అన్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ.. ‘కొన్ని రషెస్ చూడటం జరిగింది. అనుకున్నదాని కంటే ఎక్కువ బడ్జెట్ అయినా.. వెనకడుగు వేయకుండా ఈ సినిమాని తీశారు. సినిమా చాలా బాగా వచ్చిందని నమ్ముతున్నాను...’’ అని అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవి పైడిపాటి, తదితరులు పాల్గొన్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?