Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఎన్నో షేడ్స్.. మరెన్నో మలుపులు.. థాంక్యూ టీజర్

ఎన్నో షేడ్స్.. మరెన్నో మలుపులు.. థాంక్యూ టీజర్

కథలో ఏదో మేజిక్ లేకపోతే విక్రమ్ కుమార్ టచ్ చేయడు. ఇలాంటి దర్శకుడు నాగచైతన్యను హీరోగా పెట్టి థాంక్యూ అనే సినిమా చేస్తున్నాడనగానే చాలామంది చాలా ఊహించుకున్నారు. పైగా మనం కాంబినేషన్ రిపీట్ అవ్వడంతో కూసింత అంచనాలు కూడా పెరిగాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా వచ్చింది థాంక్యూ టీజర్.

కొద్దిసేపటి కిందట విడుదలైన ఈ టీజర్, చిన్నపాటి షాక్ ఇచ్చింది. నాగచైతన్య ను డిఫరెంట్ షేడ్స్ లో ప్రజెంట్ చేసింది. అదే టైమ్ లో కథపై చిన్న పాటి క్లూ కూడా ఇవ్వకుండా ముగించింది. "నా సక్సెస్ కు నేనే కారణం, నన్ను నేను సరిచేసుకోడానికి నేను చేస్తున్న ప్రయాణం" లాంటి డైలాగ్స్ టీజర్ లో ఆకట్టుకున్నాయి.

ఇక రెగ్యులర్ గా విక్రమ్ కుమార్ సినిమాల్లో కనిపించే విజువల్ ఫీస్ట్ థాంక్యూలో కూడా ఉండబోతోందనే విషయం టీజర్ చూస్తే తెలుస్తూనే ఉంది. పీసీ శ్రీరామ్ విజువల్స్ అదిరిపోయాయి. ఇక తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ కు మంచి ఫీల్ తీసుకొచ్చింది.

హీరోయిన్లు ముగ్గుర్నీ టీజర్ లో పరిచయం చేశారు. నాగచైతన్య లైఫ్ లో ఒక్కో దశలో ఒక్కో హీరోయిన్ ఉంటుందనే విషయాన్ని టీజర్ లో చెప్పేశారు. మరో కీలక పాత్రధారి ప్రకాశ్ రాజ్ ను కూడా టీజర్ లో పరిచయం చేశారు. ఇక టీజర్ కు ఫినిషింగ్ టచ్ గా సిగరెట్ తాగుతున్న చైతూ మాస్ లుక్ ను చూపించారు. 

ఇలా ఓ ఫీల్ గుడ్ ఎమోషన్ తో వచ్చింది థాంక్యూ టీజర్. ఈ సినిమాను జులై 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?