Advertisement

Advertisement


Home > Politics - Gossip

గంటాని టెన్షన్ పెడుతున్న చంద్రబాబు

గంటాని టెన్షన్ పెడుతున్న చంద్రబాబు

గంటా శ్రీనివాసరావు లాగా గోడమీద పిల్లి వాటం ఉన్న నేతలపై ఇటీవల చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం పనిచేసినవారికే టికెట్లు అన్నారు. షో మ్యాన్ లను పక్కనపెడతామని హెచ్చరించారు. దీంతో గంటాలో అంతర్మథనం మొదలైంది. ఎన్నికల వరకు వేచి చూసి పక్క పార్టీల్లోకి వెళ్లడం కంటే టీడీపీనే నమ్ముకోవడం మంచిదనుకున్నారు. ఇలా గోడమీద పిల్లివాటంతో అసలు ఏ పార్టీలోనూ టికెట్ దొరకని పరిస్థితి ఏర్పడుతుందని భయపడ్డారు.

అందుకే ఇటీవల టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఓ దశలో పార్టీ అంటే అంటీముట్టనట్టు ఉన్న ఆయన, అధినేత విశాఖ పర్యటనకు వచ్చినా కనీసం పలకరించని ఆయన, చంద్రబాబు ఏడ్చి రచ్చ చేసినా కనీసం సింపతీ చూపించని ఆయన.. ఇప్పుడు పార్టీ వ్యవహారాల్లో కలుగజేసుకోడానికి అదే కారణం అని చెబుతున్నారు. కేవలం టికెట్ భయంతోనే గంటా టీడీపీతో ప్యాచప్ అయ్యారని తెలుస్తోంది.

తాను గెలిచి, తన పార్టీ అధికారంలోకి రాకపోయే సరికి గంటా వెంటనే వైసీపీలోకి జంప్ చేయాలనుకున్నారు. కానీ పార్టీతో పాటు, పదవికి కూడా రాజీనామా చేయాలన్న జగన్ కండిషన్ తో ఆయన ఆగిపోయారు. అయినా కూడా నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ వైపు వచ్చారు. కండువా కప్పుకోలేదు కానీ పార్టీలో చేరినంత పని చేశారు. వల్లభనేని వంశీ లాంటి వారికి ఆల్రడీ టికెట్ కూడా కన్ఫామ్ అయింది.

అయితే గంటా విషయంలో ఇప్పటికే ఆలస్యమైంది. మొదట్లో పార్టీ మారాలంటే పరిస్థితులు అనుకూలించలేదు. ఇప్పుడు మారినా టికెట్ ఇస్తారన్న గ్యారెంటీ లేదు. దీంతో ఆయన వైసీపీకి ఆల్టర్నేట్ వెదికే పనిలో టీడీపీకే ఫిక్స్ అయ్యారు.

జనసేన-టీడీపీ స్నేహం మరో కారణం..

ఇన్నాళ్లూ వైసీపీ కాదంటే జనసేనలోకి వెళ్లాలనేది గంటా ప్లాన్. అందుకే కాపు సభలకి కూడా ఆయన ఉత్సాహంగా హాజరయ్యారు. కాపు అనే బ్రాండ్ తో పవన్ పంచన చేరి పార్టీలో కీలకంగా ఎదగాలనుకున్నారు. కానీ పవన్ కల్యాణ్ గంటాకి ఝలక్ ఇచ్చారు. టీడీపీతో కలిసేందుకు ఆయన ఉత్సాహం చూపిస్తున్నారు. 

ఇటీవల బాబు, పవన్ స్నేహంపై పూర్తిగా క్లారిటీ రావడంతో టీడీపీలో ఉన్నా జనసేనకి వెళ్లినా ఒకటేననే విషయం గంటాకు అర్థమైంది. పార్టీ మారినా పొత్తుల్లో భాగంగా టికెట్ సంపాదించి పోటీ చేయాలి. 

అదేదో టీడీపీలోనే ఉంటే, జనసేన సపోర్ట్ కూడా తనకే ఉంటుంది కదా అనేది గంటా విశ్లేషణగా కనిపిస్తోంది. అందుకే మెల్లగా పార్టీ కార్యకలాపాలల్లోకి అడుగుపెడుతున్నారు. 2024 కోసం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. గంటాలో సడన్ మార్పుకి ఇదే కారణం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?