దర్శకుడు తరుణ్ భాస్కర్ ఏ ముహర్తాన మొహానికి మేకప్ వేసుకున్నారో కానీ అప్పటి నుంచి వన్ బై వన్ సినిమా మీద సినిమా చేస్తూనే వస్తున్నారు. లేటెస్ట్ గా మరో సినిమాకు ఓకె చెప్పారు. విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “సంతాన ప్రాప్తిరస్తు”. ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. సంజీవ్ రెడ్డి దర్శకుడు. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా తెరకెక్కుతోంది.
ఇప్పుడు ఈ సినిమాలో కీలకపాత్ర పోషించేందుకు తరుణ్ భాస్కర్ ఎస్ చెప్పారు. సాధారణంగా కథ ఎలా వున్నా, తన పాత్రలో వైవిధ్యం లేకపోతే ఆయన ఓకె అనరు. సంతానప్రాప్తిరస్తు సినిమాలో తరుణ్ భాస్కర్ పాత్ర పేరే వైవిధ్యంగా వుంది. జాక్ రెడ్డి అన్నది పేరు..మరణానంతర సేవలు అందించడం అతని వృత్తి. కులపిచ్చ అన్నది ప్రవృత్తి. వేమన మా వాడే అంటాడు. ఈ పాత్ర తీరుతెన్నులు, బాడీ లాంగ్వేజ్ కాస్త సీరియస్ గా వున్నా, నవ్వులు పండిస్తుందట.
విక్రాంత్, చాందినీ చౌదరి, వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, శ్రీ లక్ష్మి, హర్షవర్థన్, బిందు చంద్రమౌళి, జీవన్ కుమార్, సత్య కృష్ణ, తాగుబోతు రమేష్, అభయ్ బేతిగంటి, కిరీటి, అనీల్ గీల, సద్దాం తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు.
All the best sir
కాల్ బాయ్ జాబ్స్ >>>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,