తోడల్లుడితో బాబు అపూర్వ కలయిక

ఎన్టీఆర్ పెద్దల్లుడిగా దగ్గుబాటి టీడీపీతో పునాది నుంచి ఉంటూ వచ్చారు. ఆయనే 1985 నుంచి 1989 దాకా మంత్రిగా కూడా అన్న గారి కేబినెట్‌లో పనిచేశారు.

దివంగత నేత ఎన్టీఆర్ ఇద్దరు అల్లుళ్ళూ విశాఖ వేదికగా కలవబోతున్నారు. సరిగ్గా మూడు దశాబ్దాల తరువాత ఒక బహిరంగ వేదిక మీద వీరిని అంతా చూడబోతున్నారు. రాజకీయాల్లో తన పాత్రను ముగించి రచనా వ్యాసాంగంలో కాలం గడుపుతున్న పెద్దల్లుడు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు “ప్రపంచ చరిత్ర” పేరుతో ఒక పుస్తకాన్ని రచించారు. ఆది తెలుగు ఇంగ్లీష్‌లో దగ్గుబాటి రాశారు.

ఈ నెల 6న జరిగే ఈ పుస్తకావిష్కరణ సభకు ఏపీ సీఎం హోదాతో పాటు తోడల్లుడిగా కూడా చంద్రబాబు అటెండ్ అవుతున్నారు. ఇంగ్లీష్ పుస్తకాన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆవిష్కరిస్తారు. తెలుగు పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆవిష్కరిస్తారు.

బాబు ముఖ్య అతిధిగా హాజరై, తోడల్లుడు దగ్గుబాటి రచనల మీద తనదైన శైలిలో వ్యాఖ్యానం చేస్తారు. ఈ సందర్భంగా దగ్గుబాటి గురించి బాబు ఏమి చెబుతారు, అసలు వారిద్దరి మధ్యన ఉండే సన్నిహిత బాంధవ్యాలు ఎవరికీ తెలియని విషయాలు ఈ వేదిక ద్వారా పంచుకుంటారా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు.

ఎన్టీఆర్ పెద్దల్లుడిగా దగ్గుబాటి టీడీపీతో పునాది నుంచి ఉంటూ వచ్చారు. ఆయనే 1985 నుంచి 1989 దాకా మంత్రిగా కూడా అన్న గారి కేబినెట్‌లో పనిచేశారు. ఆయన ఎంపీగా టీడీపీ నుండి గెలిచి పార్లమెంటరీ పార్టీ నేతగా వ్యవహరించారు. టీడీపీలో రెండు వర్గాలు ఉంటే ఒకదానికి దగ్గుబాటి నాయకత్వం వహించేవారు అని అప్పట్లో ప్రచారంలో ఉన్న మాట.

అలా ఇద్దరి అల్లుళ్ళ మధ్య టీడీపీలో వర్గ పోరు సాగింది. 1995 ఎపిసోడ్‌లో అన్న గారిని దించేసేటప్పుడు ఇద్దరూ కలసి పనిచేశారు. ఆ తరువాత బాబుతో విభేదించిన దగ్గుబాటి బీజేపీ, ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. ఆయన వైసీపీలో కూడా 2019లో చేరి పర్చూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయ్యాక రాజకీయాలను వదులుకున్నారు.

ఆయన శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి మాత్రం బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నారు. బాబుని గతంలో పూర్తిగా వ్యతిరేకించే దగ్గుబాటి ఆ మధ్య కాలం నుంచి సన్నిహితంగానే ఉంటున్నారు. కుటుంబ కార్యక్రమాల్లో తోడల్లుళ్ళు ఇద్దరూ కలుసుకుంటున్నారు. ఇలా బహిరంగంగా మాత్రం ఒకే వేదిక మీద కలవడం ఇదే తొలిసారి. దాంతో మార్చి 6న విశాఖలో జరగబోయే ఈ మీటింగ్ మీద అంతా ఆసక్తి నెలకొంది.

13 Replies to “తోడల్లుడితో బాబు అపూర్వ కలయిక”

  1. ఈ తోడల్లుడు మన బాబు గారి నీతి విలువల గారి మీద మంచి మంచి బుక్స్ వ్రాసారు

  2. మరీ పనిపాట లేనట్టుంది దగ్గుబాటికి … ప్రపంచ చరిత్ర రాయడం ఏంటి .. అది ఒకరివల్ల అయ్యే పనేనా

  3. ఫాఫం మాడా రెడ్డి గాడు సొంత తల్లీ మరియు సొంత షెల్లీ తో అపురూప కలయిక ఎప్పుడో, ప్చ్!!

  4. అన్నదమ్ములు కలసిపోయారు. సంతోషం. అన్నచెల్లెలు ఎప్పుడు కలుస్తున్నారు

Comments are closed.