మరోసారి త్రివిక్రమ్ పేరు ప్రస్తావన

పోసాని చేసిన మరో తప్పు త్రివిక్రమ్ ను ఇండస్ట్రీకి తీసుకురావడం. ఆయన ఇండస్ట్రీలో లేకపోతే చాలామంది జీవితాలు కాపాడి ఉండేవారు

ఏళ్ల పాటు త్రివిక్రమ్ పేరును పరోక్షంగా ప్రస్తావిస్తూ వచ్చిన పూనమ్ కౌర్, గడిచిన కొన్ని నెలలుగా ఆయన పేరును నేరుగానే ప్రస్తావిస్తోంది. తాజాగా మరోసారి త్రివిక్రమ్ పేరును తెరపైకి తీసుకొచ్చింది ఈ మాజీ హీరోయిన్.

తాజాగా అరెస్ట్ అయిన పోసాని కృష్ణమురళిపై సానుభూతి వ్యక్తం చేసిన పూనమ్, అదే టైమ్ లో ఆయనో తప్పు చేశారంటూ పోస్ట్ పెట్టింది. “పోసాని చేసిన మరో తప్పు త్రివిక్రమ్ ను ఇండస్ట్రీకి తీసుకురావడం. ఆయన ఇండస్ట్రీలో లేకపోతే చాలామంది జీవితాలు కాపాడి ఉండేవారు.” అంటూ పోస్ట్ పెట్టారు.

గడిచిన 4 నెలల్లో ఆమె త్రివిక్రమ్ పేరు ప్రస్తావించడం ఇది మూడోసారి. గతేడాది తొలిసారి ఆమె త్రివిక్రమ్ పేరును నేరుగా ప్రస్తావించారు. తను త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఇండస్ట్రీ పెద్దలకు ఫిర్యాదు చేశానని, కానీ దానిపై ఎలాంటి స్పందన లేదని ఆరోపిస్తూ ఆమె పోస్టు పెట్టారు. ఇప్పటికైనా ఇండస్ట్రీ పెద్దలు తన ఫిర్యాదుపై స్పందించి, త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ప్రశ్నించాలని ఆమె కోరారు.

ఆ తర్వాత మరోసారి ఇదే అంశానికి సంబంధించి ఆమె త్రివిక్రమ్ పేరు తెరపైకి తెచ్చారు. ఇప్పుడు పోసాని ఇష్యూకు, త్రివిక్రమ్ కు ముడిపెడుతూ ఆయన పేరును మెన్షన్ చేశారు. ఇలా సందర్భం దొరికిన ప్రతిసారి త్రివిక్రమ్ పై విమర్శలు చేయడానికి ఆమె సిద్ధంగా ఉన్నారు. అయితే త్రివిక్రమ్ మాత్రం ఇప్పటివరకు పూనమ్ కౌర్ పై స్పందించలేదు.

11 Replies to “మరోసారి త్రివిక్రమ్ పేరు ప్రస్తావన”

  1. కుష్బూ చిన్మయి. పూనం మాధవి లతా వీళ్లంతా ప్రజలు మామలని మార్చి పోయారు అనగానే ఏదో ఒక ఆరోపణ లతో బయటికి వాస్తారు ఇదే వెళ్ళ బతుకు తెరువు రానున్న రోజుల్లో ఇలాంటోల్లు. ఇంకా ఎక్కువ అవ్వొచ్చు మీడియా అటెన్షన్ తాగాలి

  2. అవకాశాలు ఉన్నంతసేపు బావ అవకాశాలు తగ్గాక ఆరోపణ

    అవకాశాలు లేకపోతే ఆరోపణలు ఎక్కువై పోతాయి

    దీపం చెట్టు దీపం పురుగులు తిరుగుతాయి

    వాటికి తెలీదు దాని మీద పడితే జీవితం పరిసమాప్తం అని

    మరి మీకు అన్నీ తెలిసి ఆటలాడి పాటలు పాడి రాసుకునే పూసుకుని సగం బట్టలతో పబ్లిక్ లో సగం బట్టలతో ప్రదర్శనలు చేసినప్పుడు ఏమనుకోవాలి

Comments are closed.