హీరో ముందు..డూప్ వెనుక

ఇటీవల ఓ రోజున బాడీ డబుల్ సెట్ కు రాలేదు. హీరోనే వచ్చేసారు. బాడీ డబుల్ ఆలస్యంగా వచ్చారు.

డూప్ అనకూడదు. బాడీ డబుల్ అనాలి. అదే లేటెస్ట్ ట్రెండ్. ఒకప్పుడు డూప్ ను కేవలం స్టంట్స్ లోనే వాడేవారు. ఇప్పుడు కొందరు హీరోలకు డూప్ లతో సినిమా ఎక్కువ లాగించేస్తున్నారు. హీరో మొహం మాత్రమే వాడుకుంటున్నారు. నిర్మాతలు కూడా బాగా అలవాటు పడిపోతున్నారు. ఎంతలా అలవాటు పడుతున్నారు అంటే, హీరోకి తెలియకుండానే బాడీ డబుల్ ను పిలిచి రెండు షాట్ లు వున్నాయి చేసి వెళ్లిపో అని చెప్పేంతగా.

టాలీవుడ్ లో ఓ టాప్ హీరో ఈ బాడీ డబుల్ సిస్టమ్ కు పెట్టింది పేరు. ఇద్దరు బాడీ డబుల్స్ వుండేవారు. ఒక బాడీ డబుల్ కాస్త లావు అయిపోవడంతో, తీసేసి, ఒకరినే పనిలో వుంచారు. సాధారణంగా ఈ హీరో మధ్యాహ్నం మూడు తరువాత కానీ సెట్ కు రారు. అప్పటి వరకు డూప్ తో షాట్ లు తీసేసి, హీరోతో క్లోజ్ లు కానిస్తారు. సాయంత్రం అన్నీ మిక్స్ చేసి, ఆన్ లైన్ లో హీరోకి పంపుతారు. హీరో చూసి పెర్ ఫెక్ట్ గా మ్యాచ్ అయితే ఓకె. లేదంటే తనే చేస్తానని అప్పుడు రంగంలోకి దిగుతారు.

ఇదిలా వుంటే ఇటీవల ఓ రోజున బాడీ డబుల్ సెట్ కు రాలేదు. హీరోనే వచ్చేసారు. బాడీ డబుల్ ఆలస్యంగా వచ్చారు. ఎంతయినా టాప్ హీరో కదా. ఆయన వంద కోట్లు తీసుకుంటూ బాడీ డబుల్ కు మహా అయితే కోటి ఇస్తారు. అందువల్ల కాస్త కోపం వచ్చింది. తన కన్నా ఆలస్యంగా వస్తారా? అంటూ కాస్త చిరాకు పడ్డారు. కానీ బాడీ డబుల్ చెప్పిన సమాధానం విని, నాలుక కరుచుకుని, అయ్యో..అలాగా..సారీ..అంటూ బుజ్జగించారు.

ఇంతకీ బాడీ డబుల్ చెప్పిందేమిటంటే అదే హీరో చేస్తున్న మరో సినిమాకు సంబంధించి కొన్ని ప్యాచ్ వర్క్ షాట్ లు వుంటే కబురు చేసారట. వెళ్లి ఆ పని చేసి వచ్చాడు. గమ్మత్తేమిటంటే ఈ సంగతి హీరోకే తెలియదు. అవతలి ప్రాజెక్ట్ డైరక్టర్ కానీ, నిర్మాత గానీ చెప్పనే లేదు. ఎలాగూ బాడీ డబుల్ నే కదా చేసేది అని పిలిచి చేయించేసుకున్నారు. అదీ విషయం.

18 Replies to “హీరో ముందు..డూప్ వెనుక”

  1. ఇలాంటిల్లకి. Malla abhimaana సంఘాలు. ఇందిరా ఈ ఘాతుకం. ఎంత గొప్ప సినిమా అయినా. క్రెడిట్ డైరెక్టర్ నిర్మాత .కానీ ఈ హీరో లె ఎక్కువ శాతం డబ్బు. ఎందుకంటే మమలని చూసి సినిమా కి వస్తున్నారు అని.మారి నే సినిమా లు కొన్ని ఎందుకు ఆడటం లేదు అంతే మాత్రం సమాధానం లేదు

  2. ఆ బాడీ డబుల్స్ కోసం పాపం ఫ్యాన్స్ వేలకు వేలు పెట్టీ టికెట్స్ కొంటున్నారు.

  3. వంద కోట్లు తీసుకునే హీరోలు కేవలం ప్రభాస్ అండ్ అల్లు. మహా ఐతే మహేష్. ఇందులో ప్రభాస్ ఒక్కడే చాలా సినిమాల్లో నటిస్తున్నాడు.

  4. ఇందులో వింత ఏముంది, రోబో మూవీ 95% ఒక హాలీవుడ్ బాడీ డూప్ గాడతోనే చేసారు రజినీకాంత్

  5. సిఎం ప్యాలస్ లో గురక బెట్టినా సిఎం ని

    లకే డూప్ లుగా వుంది మొత్త ప్రభుత్వం నడిపిన సకల శాఖ మంత్రి ఉదాహరణ వుందిగా.

Comments are closed.