డిసెంబర్ లో అఖండ..పుష్ప…జనవరిలో బంగార్రాజు..ఫిబ్రవరిలో ఖిలాడీ..డిజె టిల్లు…మొత్తానికి థియేటర్లకు ఊపు వచ్చింది. తెలంగాణలో ఎక్కువ రేట్లు కావచ్చు..ఆంధ్రలో తక్కువ రేట్లు కావచ్చు. మొత్తం మీద థియేటర్లు కళకళలాడాయి.
ఆంధ్రలో 50శాతం ఆక్యుపన్సీ కారణం కావచ్చు. ఎక్కువ థియేటర్లు ఫుల్స్ కనిపిస్తున్నాయి. కాకినాడ లాంటి సెంటర్ లో డిజె టిల్లు 7 థియేటర్లు పెడితే ఫుల్స్ రావడం అంటే యాభై శాతం ఆక్యుపెన్సీ ఫలితమే అనుకోవాలి.
విశాఖ సిటీ పరిథిలో నాలుగు థియేటర్లు, గుంటూరులో ఎనిమిది థియేటర్లు ఫుల్స్ వచ్చాయన్నా యాభైశాతం ఆక్యుపెన్సీనే కారణం అనుకోవాలి. నిజానికి డిజె టిల్లు లాంటి చిన్న, మీడియం సినిమాలకు యాభై శాతం ఆక్యుపెన్సీ అన్నది మంచి ఆప్షన్.
ఖిలాడీ సినిమా మంచి ఓపెనింగ్ లు తీసుకుంది. ముఖ్యంగా పెద్ద సినిమా కావడంతో హయ్యర్లు గట్టిగా వచ్చాయని తెలుస్తోంది. కానీ కంటెంట్ వీక్ అన్న టాక్ రావడంతో, డిజె టిల్లు విడుదల వుండడంతో రెండో రోజు కాస్త డౌన్ అయింది. ఆ సంగతి ఎలా వున్నా థియేటర్లకు మాత్రం మంచి ఊపు అయితే వచ్చింది.