మొన్న కాజల్, ఇప్పుడు రాధిక ఆప్టే

ఒకప్పుడు బాలీవుడ్ కు వెళ్లి సౌత్ ను తిట్టిన హీరోయిన్లు ఉన్నారు. కానీ ఇప్పుడు అదే బాలీవుడ్ గడ్డపై నిల్చొని, ఆ ఇండస్ట్రీలో ఉన్న లోపాల్ని బాహాటంగా ఎత్తిచూపుతున్నారు. మొన్నటికిమొన్న బాలీవుడ్ లో క్రమశిక్షణ,…

ఒకప్పుడు బాలీవుడ్ కు వెళ్లి సౌత్ ను తిట్టిన హీరోయిన్లు ఉన్నారు. కానీ ఇప్పుడు అదే బాలీవుడ్ గడ్డపై నిల్చొని, ఆ ఇండస్ట్రీలో ఉన్న లోపాల్ని బాహాటంగా ఎత్తిచూపుతున్నారు. మొన్నటికిమొన్న బాలీవుడ్ లో క్రమశిక్షణ, విలువలు లేవంటూ పెద్ద బాంబ్ పేల్చింది కాజల్. అది కూడా ముంబయిలో జరిగిన ఓ పెద్ద కార్యక్రమంలో. ఇప్పుడు రాధికా ఆప్టే వంతు వచ్చింది.

రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ పై విరుచుకుపడింది రాధికా ఆప్టే. బాలీవుడ్ మేకర్స్ టాలెంట్ చూడరని, బాహ్య సౌందర్యాన్ని మాత్రమే చూస్తారని విమర్శలు గుప్పించింది. అక్కడితో ఆగకుండా బాడీషేమింగ్ కూడా చేస్తారని చెప్పుకొచ్చింది.

కెరీర్ స్టార్టింగ్ లో బాలీవుడ్ లో అవకాశాల గురించి ప్రయత్నిస్తున్న టైమ్ లో తనకు పెదవులు పెద్దగా ఉన్నాయని, వక్షోజాలు చిన్నగా ఉన్నాయని ఓ మేకర్ బాడీషేమింగ్ చేశాడంటూ బాంబ్ పేల్చింది రాధిక. శరీరభాగాలు సవ్యంగా లేకపోతే, అది తన తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించింది.

ఇదే హీరోయిన్ గతంలో సౌత్ ఇండస్ట్రీతో పాటు, టాలీవుడ్ పై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది. తొలిసారి ఇలా బాలీవుడ్ మేకర్స్ పై విరుచుకుపడింది. ఆమె నటించిన ఒరిజినల్ మూవీ ఒకటి జీ5లో ఈరోజు నుంచి స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ సందర్భంగా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఇలా సూటిగా ఆరోపణలు చేసింది రాధికా ఆప్టే.