బన్నీకి ఇంతకంటే మంచి ఛాన్స్ మళ్లీ రాదు!

పుష్ప-2… బిజినెస్ లో రికార్డులు సృష్టించింది. 11,500 స్క్రీన్స్ కు పైగా రిలీజ్ కు రెడీ అవుతూ మరో రికార్డ్ కూడా సృష్టించబోతోంది. అల్లు అర్జున్ కెరీర్ లో హయ్యస్ట్ ప్రీ-రిలీజ్ బిజినెస్, బిగ్గెస్ట్…

పుష్ప-2… బిజినెస్ లో రికార్డులు సృష్టించింది. 11,500 స్క్రీన్స్ కు పైగా రిలీజ్ కు రెడీ అవుతూ మరో రికార్డ్ కూడా సృష్టించబోతోంది. అల్లు అర్జున్ కెరీర్ లో హయ్యస్ట్ ప్రీ-రిలీజ్ బిజినెస్, బిగ్గెస్ట్ థియేట్రికల్ రిలీజ్ ఇదే.

బన్నీకి ఇంతకంటే మంచి ఛాన్స్ మళ్లీ దొరకదు. యూఎస్ఏ లో అతడు సాధించాల్సిన రికార్డులు కొన్ని ఉన్నాయి. అవి సాధించాలంటే పుష్ప-2కు మించిన ఆయుధం ప్రస్తుతానికి బన్నీ చేతిలో లేదు.

యూఎస్ టాప్-10 తెలుగు చిత్రాల్లో డామినేషన్ అంతా ప్రభాస్ దే. అగ్రస్థానం బాహుబలి-2ది కాగా, తాజాగా కల్కి సినిమాతో రెండో స్థానం కూడా ప్రభాసే కైవసం చేసుకున్నాడు. ఇలా చూసుకుంటే.. టాప్-10లో బాహుబలి-2, కల్కితో పాటు సలార్, బాహుబలి-1 సినిమాలు కూడా ఉన్నాయి.

ఇదే టాప్-10లో రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా కొనసాగుతున్నారు. అయితే బన్నీకి మాత్రం ఇప్పటివరకు ఉన్నది ‘అల వైకుంఠపురములో’ సినిమా మాత్రమే. పైగా హనుమాన్, దేవర లాంటి సినిమాల రాకతో మెల్లమెల్లగా ఒక్కో స్థానం కిందకు జారిపోతోంది ‘అల వైకుంఠపురములో’ సినిమా.

ఇలాంటి టైమ్ లో పుష్ప-2 సినిమాతో ఓవర్సీస్ లో బన్నీ తన సత్తా చాటాలి. మరీ ముఖ్యంగా డాలర్ల వేటలో అతడు టాప్-5లోకి అడుగుపెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

యూఎస్ టాప్-5 తెలుగు మూవీస్ లో బన్నీ సినిమా లేదు. కనీసం 5 మిలియన్ డాలర్ క్లబ్ లో కూడా అతడి సినిమాల్లేవు. దేవరతో ఎన్టీఆర్ రీసెంట్ గా ఈ క్లబ్ లోకి ఎంటరయ్యాడు. హనుమాన్ సినిమాతో తేజ సజ్జా కూడా ఇందులో కొనసాగుతున్నాడు. కాబట్టి అల్లు అర్జున్ పుష్ప-2తో ఓవర్సీస్ లో మంచి వసూళ్లు సాధించాలి. యూఎస్ఏ టాప్-5 గ్రాసర్స్ లిస్ట్ లోకి చేరడానికి బన్నీకి ఇంతకుమించిన మంచి అవకాశం రాదు.

8 Replies to “బన్నీకి ఇంతకంటే మంచి ఛాన్స్ మళ్లీ రాదు!”

  1. బన్నీ గారి అభిమానులతో పాటు… వైకాపా కార్యకర్తలు… అభిమానులంతా యధా శక్తి ట్రై చేసి… మంచి వసూళ్లు చూపించాలని మనవి

Comments are closed.