ఈ వారం మూడు, నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో కాస్త అంతో ఇంతో బజ్ వున్నది మత్తువదలరా 2. సీక్వెల్ కావడం, మైత్రీ సంస్థ నుంచి వచ్చే సినిమా కావడం, ప్రభాస్, రాజమౌళి లాంటి వాళ్ల ప్రచార సహకారం, ఇవన్నీ కలిసి కాస్త బజ్ ను తెచ్చాయి. అ మేరకు కాస్త ఓపెనింగ్ ఫరవాలేదు అనేలా వుంది.
సినిమా తొలిసగం జనాలు ఫుల్ పైసా వసూలు అనుకుంటారు. మలిసగం వచ్చే సరికి తొలిసగాన్ని మరిపించేంత ఫన్ జనరేట్ కాలేదు. పైగా బాగా లెంగ్తీ అపరేషన్ అనిపించింది. కానీ ద్వితీయార్ధంలో కూడా సత్య, వెన్నెల కిషోర్ కొంత హడావుడి చేయడం, తెలుగు సీరియళ్ల సెటైర్ ఇవన్నీ కలిసి, సినిమాను దాని రేంజ్‌కు సరిపోతుంది లే ..అనే వరకు తీసుకెళ్లాయి. ఈ సినిమా కమెడియన్ సత్యకు ఎక్కువ పనికి వస్తుంది. హీరో సింహా కు కన్నా.
రాజ్ తరుణ్ సినిమా భలే వున్నాడు. ఫస్ట్ రాజ్ తరుణ్ ఏదో అద్భుతం జరిగితే తప్ప సరైన హిట్ ను చవిచూసేలా లేడు. భలే వున్నాడు చిన్న పాయింట్ ను పట్టుకుని, దాని చుట్టూ అల్లిన మారుతి టైపు అడల్ట్, చిల్లర కామెడీ. తొలిసగంలో కొంత వరకు విటి గణేష్ కామెడీ వర్కవుట్ అయింది. కానీ మలిసగంలో ప్రీ క్లయిమాక్స్ నుంచి క్లయిమాక్స్ వరకు అంత రుచించదు. సరైన హీరోయిన్ ను తీసుకోవడానికి బడ్జెట్ సమస్య కావచ్చు. సినిమా మొత్తం మీద ఒక్కటి కూడా కొత్త సీన్ లేదు. అందుకే కలెక్షన్లు కూడా అలాగే వున్నాయి. రాజ్ తరుణ్ చుట్టూ వున్న వివాదాలు ఏవీ ఈ సినిమాకు అదనపు ప్రచారం తేలేదు.
ఎఆర్ఎమ్ అనేది మలయాళ డబ్బింగ్ సినిమా. నిజానికి మంచి కథ. నివోనా థామస్ చేసిన మూడు పాత్రల్లో రెండు పాత్రలు అకట్టుకుంటాయి. కానీ మూడో పాత్రను కావాలని అలా డిజైన్ చేసినట్లున్నారు. అది పెద్దగా నచ్చదు. టోవినో థామస్ మొదటి రెండు పాత్రలు బాగా చేసాడు. కథ పీరియాడిక్ కావడం, పదుల కొద్దీ మలయాళ నటులే ప్రతి సీన్ లో వుండడంతో కొంచెం కనెక్ట్ కావడం అంత సులువు కాదు. కానీ విజువల్స్, స్పాన్, ట్రజర్ హింట్ కాన్సెప్ట్ ఇవన్నీ కలిసి ఓ డిఫరెంట్ సినిమా చూస్తున్న ఫీల్ ను అయితే ఇస్తాయి. కానీ నటులు ఎవ్వరూ పెద్దగా తెలియకపోవడం, టైటిల్ ఇలాంటివి అన్నీ కలిసి కాస్త డీసెంట్ ఓపెనింగ్ ను కూడా తేలేదు.
ఎలా ఉన్నా వీటిని థియేటర్లో చూడం
Call boy works 9989793850
Raviteja movies anni flops 7 movies line ga flops