తిట్టాలంటే ‘ప్రాంతీయ’వాదమే ఆయుధమా…? 

మానవ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో వలసలు అనేవి అత్యంత సహజం. ఒక ప్రాంతంవారు మరో ప్రాంతంలో నివసిస్తారు. అక్కడి ప్రజలతో, ఆ ప్రాంతం కల్చర్ తో, సంప్రదాయాలతో కలిసిపోయి జీవిస్తారు. తాము బతుకుతున్న ప్రాంతాన్ని తమ…

మానవ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో వలసలు అనేవి అత్యంత సహజం. ఒక ప్రాంతంవారు మరో ప్రాంతంలో నివసిస్తారు. అక్కడి ప్రజలతో, ఆ ప్రాంతం కల్చర్ తో, సంప్రదాయాలతో కలిసిపోయి జీవిస్తారు. తాము బతుకుతున్న ప్రాంతాన్ని తమ ప్రాంతంగానే భావిస్తారు. అలాంటి ప్రజలను “నువ్వు ఈ పాంతంవాడివి కాదు”అనడం సమంజసమా ?

ఇండియా విభజన జరిగి పాకిస్తాన్ ఏర్పడినప్పుడు అనేకమంది భారతీయులు లేదా హిందువులు ఆ ప్రాంతం వదిలి రాలేక అక్కడే ఉండిపోయారు. దేశాలు విడిపోయినా, రాష్ట్రాలు విడిపోయినా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.

ఇదంతా ఎందుకు చెప్పుకోవలసి వస్తోందంటే …బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ గొడవలో కౌశిక్ రెడ్డి ప్రాంతీవాదాన్ని లేవదీశాడు. గాంధీ ఆంధ్రావాడని, తాను పక్క తెలంగాణావాడినని, తాను లోకల్ అని, గాంధీ నాన్ లోకల్ అని అన్నాడు. అంటే గాంధీని ఈ విధంగా తిట్టాడన్నమాట.

ఏపీ అండ్ తెలంగాణ విడిపోయి పదేళ్లు దాటిపోయింది. హైదరాబాదు కూడా పూర్తిగా తెలంగాణ పరమైంది. కానీ గులాబీ పార్టీ నాయకులు మాత్రం ఇంకా ఉద్యమ కాలం నాటి పాచిపోయిన నినాదాన్నే పట్టుకొని వేలాడుతున్నారు. దానికి కాలం చెల్లిందని గ్రహించడంలేదు. ఇప్పటికీ దాన్నొక తిట్టుగా ఉపయోగించుకుంటున్నారు. ఈమధ్య హరీష్ రావు కూడా రేవంత్ రెడ్డిని ఇలాంటి మాటే ఏదో అన్నట్లు గుర్తు.

రాష్ట్రం ఉమ్మడి ఏపీగా ఉన్నప్పుడు ఆంధ్ర నుంచి తెలంగాణకు, తెలంగాణ నుంచి ఆంధ్రకు వలసలు సాగాయి. హైదరాబాదు రాజధాని కాబట్టి, ఇక్కడ అనేక సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి, విద్యా సంస్థలు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు ఇక్కడే కేంద్రీకృతమై ఉన్నాయి కాబట్టి సహజంగానే ఆంధ్ర నుంచి లక్షలాదిమంది ఇక్కడకు వచ్చేశారు. తరతరాలుగా స్థిరపడ్డారు.

ఇళ్ళు కట్టుకున్నారు. ఆస్తులు కొనుక్కున్నారు. వ్యాపారాలు చేశారు. సరే …కొన్ని కారణాలవల్ల తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. రాష్ట్రం విడిపోయినప్పుడు కేసీఆర్ ఏమన్నాడు? తెలంగాణలో ఉన్నవారు ఏ రాష్ట్రంవారైనా వారిని తెలంగాణ వారిగానే పరిగణిస్తాం అని చెప్పాడు. కాబట్టి వ్యాపారాల్లో కావొచ్చు, రాజకీయాల్లో కావొచ్చు ఇక్కడ స్థిరపడిన ఆంధ్ర మూలాలు ఉన్నవారంతా తెలంగాణ వారే అవుతారు.

గులాబీ పార్టీ ఎమ్మెల్యేల్లో కొందరు ఆంధ్ర మూలాలు ఉన్నవారుంటే అది వారి తప్పు కాదు. వారిని తెలంగాణ వారిగా పరిగణించి కేసీఆర్ టిక్కెట్లు ఇచ్చారు. అలాగే గాంధీకి కూడా టిక్కెట్ ఇచ్చారు. ఆయన ఒకసారి కాదు గులాబీ పార్టీ తరపున రెండుసార్లు గెలిచాడు. ఒకసారి టీడీపీ తరపున గెలిచాడు. తెలంగాణా ఉద్యమంలో ఆంధ్ర వాళ్ళు భయపడితే కేసీఆర్ వారికి భరోసా ఇచ్చాడు.

వాళ్ళ కాల్లో ముల్లు గుచ్చుకుంటే తన పంటితో తీస్తానన్నాడు. కానీ గులాబీ పార్టీ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం అప్పుడప్పుడు ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొడుతుంటారు. కౌశిక్ రెడ్డి కూడా అదే పని చేశాడు. కానీ ప్రజలు ఇప్పుడు తెలంగాణ సెంటిమెంటును పట్టించుకోవడంలేదని మొన్నటి అసెంబ్లీ అండ్ పార్లమెంటు ఎన్నికలు నిరూపించాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో పల్లె తెలంగాణ గులాబీ పార్టీని అధికారానికి దూరం చేయగా, ఆంధ్రా వాళ్ళు అత్యధికంగా ఉన్న హైదరాబాదు నగరం ఆ పార్టీని నెత్తిన పెట్టుకుంది. నగరంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా ఇవ్వంది సెటిలర్లు అనబడే ఆంధ్ర వాళ్ళే కదా. మరి ఇంకా ఎందుకు ఆంధ్ర వాళ్ళు అంటూ చులకనగా చూడటం ? బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి.

15 Replies to “తిట్టాలంటే ‘ప్రాంతీయ’వాదమే ఆయుధమా…? ”

  1. His name has Gandhi but attacking kaushik reddy by going to his house with big convoy resembled గూండా గిరి ..shame on him taking Cabinet rank PAC chairman post being elected on TRS. Koushik reddy also need to withdrew his comments.

  2. విడిపొకముందు అంద్రా వారి సం..క నా,…కినారు ..

    విడిపొయిన తర్వాత కూడా ఇంకా ఎందుకురా మా సం.,,క నా,…కుతారు ..

    ఒరె….య్ అగ్గిపెట్టి మచ్చా మా పెరు లెకుండా రాజకియం చెయ్యలెవా రా లండీకె

  3. మరి బ్రిటిష్ వారు ఏం పాపం చేసేరు.. వారి మీద ద్వేషం పెంచి ఈ దేశం నుండి తరిమెసేరు పాపం…

  4. నువ్వు ఒక పక్షపాతివి..తెలంగాణవాదం…అది భూమి వున్నంత వరకు వుంటుంది..నీలాంటి వాడికి అర్థం కాదు..

    1. TRS expired and now it’s BRS

      this so called BRS opened party offices in every state of India and biggest BRS party office in Mangalagiri, guntur, AP

      Moreover KTR studied in Guntur and technically native of AP

      Enduku sollu, iddaru bhosadikey gaallu thittukontey Andhra ki Emi raa sambandham

Comments are closed.