ఉక్కు కోసం టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేల రాజీనామా?

విశాఖ ఉక్కు కర్మాగారం ఊరకే రాలేదు. ముప్పయి అయిదు మంది అమరులు అయ్యారు. ఎంతో మంది జైలు పాలు అయ్యారు. ఏకధాటిగా అయిదారేళ్ల పాటు ఉద్యమాలు చేసిన మీదటనే ఆనాటి కేంద్ర ప్రభుత్వం కరిగింది.…

విశాఖ ఉక్కు కర్మాగారం ఊరకే రాలేదు. ముప్పయి అయిదు మంది అమరులు అయ్యారు. ఎంతో మంది జైలు పాలు అయ్యారు. ఏకధాటిగా అయిదారేళ్ల పాటు ఉద్యమాలు చేసిన మీదటనే ఆనాటి కేంద్ర ప్రభుత్వం కరిగింది.

అలా వచ్చిన స్టీల్ ప్లాంట్ ఇపుడు పునర్జన్మ ఎత్తాలని చూస్తోంది. ప్రైవేట్ వేటు తప్పించుకుంటే స్టీల్ ప్లాంట్ కి రెండవ జన్మ వచ్చినట్లే. ఇది జరగాలీ అంటే ఉద్యమాలు భారీ స్థాయిలో జరగాలి. కేవలం స్టీల్ ప్లాంట్ ఉద్యోగ కార్మికులు అందోళన చేస్తే కుదిరేది కాదు,

రాజకీయంగా కూడా కుదుపు రావాలి. కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి ఏపీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు కీలకంగా ఉన్నారు. అందువల్ల విశాఖ ఎంపీగా ఉన్న టీడీపీ నేత శ్రీ భరత్ రాజీనామా చేయాలని డిమాండ్ ఉంది. గాజువాక పరిధిలో స్టీల్ ప్లాంట్ ఉంది. దాంతో గాజువాక టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అయిన పల్లా శ్రీనివాస్ రాజీనామా చేస్తే కూటమి ప్రభుత్వాల మీద వత్తిడి పెరుగుతుంది అని అంటున్నారు

ఈ డిమాండ్ ని కార్మిక సంఘాలతో పాటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది అని ఆయన అంటున్నారు. స్టీల్ ప్లాంట్ మెల్లగా ప్రైవేట్ కోరలలోకి వెళ్ళిపోతోంది అని అన్నారు.

దానిని అడ్డుకోవాలీ అంటే టీడీపీ ఎంపీ ఎమ్మెల్యే రాజీనామా చేయాల్సిందే అని ఆయన కోరారు. గతంలో గంటా శ్రీనివాసరావు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనని రాజీనామా చేశారు అని గుర్తు చేశారు. ఆయనను స్పూర్తిగా తీసుకోవాలని కోరారు.

వైసీపీ ఈ విధంగా టీడీపీని బుక్ చేస్తోంది. గతంలో వైసీపీ మీద టీడీపీ ఇదే రకమైన రాజకీయ వ్యూహం అమలు చేసింది. ఇపుడు విశాఖ అంతా టీడీపీ కూటమే గెలిచింది. దాంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో ముడిపెట్టి రాజీనామాలకు డిమాండ్లు చేస్తున్నారు. ఇప్పటికే కార్మిక సంఘాలు టీడీపీ కూటమి మీద మండిపడుతున్నాయి. రాజీనామాల డిమాండ్ ముదిరితే టీడీపీ ఇబ్బందుల్లో పడుతుందని అంటున్నారు.

9 Replies to “ఉక్కు కోసం టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేల రాజీనామా?”

  1. అప్పట్లో మన vi sa re గారు రాజీనామాల గురించి చెప్పిన ఆణిముత్యాలు అందరూ మర్చిపోయారా GA….😂😂😂

  2. మన అన్నయ్య చేతగాని తనం అర్థం అయ్యి..

    కాంగ్రెస్ కి help చేస్తున్నావా GA….😂😂

  3. Nothing achieved by current Kootami government except comparisons with previous government or blaming previous government or trolling anyone who questions current government inefficiency.

  4. కచ్చితం గ ప్రైవేట్ వారికీ అమ్మేయడమే బెటర్ ప్లాంట్ కి అవసరమైన స్థలం ఫ్యాక్టరీ తో పటు ఉంచి మిగిలిన విలువైన స్థలం స్టేట్ govt తీసుకొని దానిని అమ్మి వైజాగ్ ని డెవలప్ చేసి ఉపాధి అవకాశాల కు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచి పరిశ్రమలకు అవసరమైన సదుపాయాలు కల్పించి ఉపాధి కల్పిస్తే మంచిది

Comments are closed.