ఆంధ్రప్రభుత్వం కనుక టికెట్ రేట్లు సవరిస్తే ముందుగా లాభం పొందే సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్. ఈ సినిమాను తక్కువ రేట్లకే ఆంధ్రలో ఇచ్చారు. కేవలం ఆంధ్ర ఒక్కటే (సీడెడ్ కాకుండా) 40 కోట్ల రేషియోలో విక్రయించారు.
సినిమా మీద భయంకరమైన క్రేజ్ వుంది. యాభై కోట్ల రేషియో కి కూడా బయ్యర్లు పోటీ పడుతున్నారు. అయితే ఈ తక్కువ రేట్ల మీద ఎక్కడన్నా బ్రేక్ ఈవెన్ కాకపోతెే సమస్య అవుతుందని 40 కోట్ల రేంజ్ లోనే ఇవ్వడానికి సిద్దపడ్డారు.
కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. కొత్త రేట్లు వచ్చేలా కనిపిస్తోంది. ఇప్పుడు కనుక భీమ్లా నాయక్ నిర్మాత మనసు మార్చుకుంటే ఒక్క ఆంధ్ర మీదనే 10 కోట్లు అదనంగా వచ్చే అవకాశం క్లియర్ గా వుంది. అలాగే సీడెడ్ లో అదనంగా కనీసం రెండు కోట్లు అయినా అదనంగా ఆదాయం వచ్చే అవకాశం వుంది.
కానీ ముందుగా అదనంగా తీసుకుంటారో? లేక రిలీజ్ తరువాత ఓవర్ ప్లోస్ తీసుకోవడానికి మొగ్గు చూపుతారో చూడాలి.