‘టైగర్’.. టైగర్ లాగే వుంది

టైగర్ నాగేశ్వరరావు ట్రయిలర్ వచ్చింది. సినిమా అభిమాన జనం కాస్త ఆసక్తిగానే ఎదురు చూస్తున్నారు ఈ సినిమా కోసం. వారి ఆశలను నిలబెట్టేలాగే వుంది ట్రయిలర్. అవుట్ అండ్ అవుట్ ఇంటెన్సివ్ గా ట్రయిలర్…

టైగర్ నాగేశ్వరరావు ట్రయిలర్ వచ్చింది. సినిమా అభిమాన జనం కాస్త ఆసక్తిగానే ఎదురు చూస్తున్నారు ఈ సినిమా కోసం. వారి ఆశలను నిలబెట్టేలాగే వుంది ట్రయిలర్. అవుట్ అండ్ అవుట్ ఇంటెన్సివ్ గా ట్రయిలర్ ను కట్ చేసారు దర్శకుడు వంశీ.

స్టూవర్ట్ పురం నాగేశ్వరరావును చూపించుకుంటూ వచ్చి, టైగర్ నాగేశ్వరరావుగా ఎలా మారాడు. మారిన తరువాత ఎలా వున్నాడు అన్నది చూపించారు.

ట్రయిలర్ మొత్తం వేగంగా నడిచింది. ఎక్కడా రిపీట్ సీన్లు లేవు. స్పేస్ ఫిల్ అనే కాన్సెప్ట్ కనిపించలేదు. కావాల్సినంత వుంది కట్ చేసుకుని వేసుకోవడానికి అనేట్లే వుంది. కథ ఏమిటి అన్నది జనాలకు తెలిసిందే. కథనం ఏమిటి అన్నది ట్రయిలర్ లో కాస్త టచ్ చేసారు. స్టూవర్ట్ పురం దొంగలు, వారి మధ్య గొడవలు, వారిని వాడుకుని సంపద పెంచుకునే పెద్ద మనిషి, నాగేశ్వరరావు అతగాడి దొంగతనాలు, విలాసాలు, ప్రేమలు,  స్ట్రిక్ట్ పోలీస్ అధికారి ఇలా సాగింది కథనం.

ఈ కథనంలోకి అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని కూడా తీసుకు వచ్చేసారు దర్శకుడు వంశీ. ఎందుకు ఏమిటి అన్నది సినిమాలో చూడాలేమో? టెక్నికల్ వర్క్ బాగుంది. బ్యాక్ గ్రవుండ్ స్కోర్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ కాంటెంపరరీగా వున్నాయి.  మొత్తం మీద సినిమా మీద హోప్స్ ను పెంచేలా వుంది ట్రయిలర్.