2023 సమ్మర్ టైమ్ లో విడుదల కావాల్సిన సినిమా టిల్లు స్క్వేర్. అప్పటి కి ఏడాది ముందు 2022 లో విడుదలయింది డిజె టిల్లు. అప్పటి నుంచి సెట్ మీదే వుంది టిల్లు స్క్యేర్. హీరోయిన్ లు మారారు. అనుపమ ఫిక్స్ అయింది.
కానీ సినిమా మాత్రం అనుకున్నట్లుగా ముందుకు సాగడం లేదు. ఆరంభంలో ఈ సినిమా మీద మాంచి క్రేజ్ వుంది. కానీ ఒక్కో పాట వదులుతున్నా, ఆశించిన క్రేజ్ రావడం లేదు. దానికి తోడు షూటింగ్ ఒక అడుగు ముందుకు, ఒక అడుగు వెనక్కు జరుగుతోందని, సిద్దు జొన్నలగొడ్డ చెక్కడం అనే కళలో ఆరితేరడం వల్లనే ఈ సమస్య అని రకరకాల గ్యాసిప్ లు.
ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమా డేట్ ను త్యాగం చేసి ఈగిల్ సినిమాకు ఇచ్చారు. నిజానికి ఈగిల్ ఇవ్వడానికి ముందే ఈ సినిమాను వాయిదా వేసుకునే ఆలోచనలో వున్నారన్నది ఇన్ సైడ్ టాక్. మార్చిలో ఇదే సంస్థ నిర్మించిన విష్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా విడుదల వుంది. అందువల్ల ఏప్రిల్ లో విడుదల చేసుకోవాల్సి వుంటుంది. కానీ ఈసారి ఎన్నికలు మార్చి, ఏప్రిల్ మధ్యలోనే వుంటాయని టాక్ వుంది. దాని వల్ల పరిక్షల తేదీలు కూడా అటు ఇటు అయ్యే అవకాశం వుంది.
ఇలాంటి నేపథ్యంలో టిల్లు స్క్యేర్ విడుదలకు ఇక మంచి టైమ్ సమ్మర్ నే. సినిమాలకు మంచి సీజన్ కూడా. బహుశా ఆ ఉద్దేశంతోనే డేట్ ను ఈగిల్ కు త్యాగం చేసి వుండొచ్చు కూడా.