టైటిల్ మాత్రమే కాదు.. కంటెంట్ కూడా

ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఖుషీ సినిమా ట్రయిలర్ వచ్చింది. విజయ్ దేవరకొండ-సమంత ల కాంబినేషన్లో మైత్రీ మూవీస్ నిర్మించిన సినిమా. శివనిర్వాణ దర్శకుడు. ట్రయిలర్ ను క్వాలిటీ పరంగా చూసుకుంటే బాగుంది. మాంచి విజువల్స్,…

ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఖుషీ సినిమా ట్రయిలర్ వచ్చింది. విజయ్ దేవరకొండ-సమంత ల కాంబినేషన్లో మైత్రీ మూవీస్ నిర్మించిన సినిమా. శివనిర్వాణ దర్శకుడు. ట్రయిలర్ ను క్వాలిటీ పరంగా చూసుకుంటే బాగుంది. మాంచి విజువల్స్, బ్యాక్ గ్రవుండ్ స్కోర్, పాటలు, ఇలా బాగుంది. కానీ కంటెంట్ పరంగా చూసుకుంటే రెగ్యులర్ కంటెంట్ లా అనిపిస్తోంది.

కాశ్మీర్ వెళ్లిన కుర్రాడికి అక్కడ ఓ ముస్లిం అమ్మాయి కనిపించడం, వెంటపడడం, ప్రేమించడం అన్నీ కలిసి గతంలో వచ్చిన దేశముదురు ఛాయలను గుర్తు చేసాయి. తరువాత తీరా చేస్తే ఆ అమ్మాయి బేగం కాదు, బ్రాహ్మిన్ అన్నది ట్విస్ట్. బ్యాండ్ మేళం బ్యాచ్ ను చూపించినట్లు అడ్డ బొట్లు పెట్టి, బ్రాహ్మిన్స్ అని చెప్పే ప్రయత్నంతో అమ్మాయి తరపు వారి పరిచయం. ఆఖరికి పెళ్లి. ఇక్కడ ఇటీవలే వచ్చిన అంటే సుందరానికి సినిమా గుర్తు వస్తుంది.

కట్ చేస్తే ఇద్దరి మధ్య మనస్పర్దలు. అపార్దాలు, ఆవేదనలు. ఇక్కడ అక్కడక్కడ గీత గోవిందం లైట్ టచ్ కనిపించింది. వెరసి ట్రయిలర్ చెబుతున్నది ఇదే. అయితే కొత్త కథలు ఎక్కడి నుంచి పుట్టుకువస్తాయి. అంటే సుందరానికి అయినా, కృష్ణ వృింద విహారి అయినా మరోటి అయినా కథలు ఒకటే కథనం మారుతుంది అని సరిపెట్టుకోవాలి.

సమంత-విజయ్ జంట కొన్ని సీన్లలో చాలా బాగుంది. కొన్ని సీన్లలో మ్యాచ్ కాలేదు అనిపించింది. మొత్తం మీద తెలుగు ఆడియన్స్ వరకు ఈ ట్రయిలర్ తో నెట్టుకురావచ్చు కానీ పాన్ ఇండియా అంటే కాస్త అనుమానమే.