టాలీవుడ్ కు వ్యాక్సీన్ అండ

కరోనా వల్ల పలు వ్యాపారాలు అద్భుతంగా లాభాలు చేసుకున్నాయి. కొన్ని వ్యాపారాలు నష్టపోయాయి. బాగా ఎక్కువగా నష్టపోయింది సినిమా రంగమే. అటు సినిమాల ప్రదర్శన ఆగిపోయి, ఇటు సినిమాల షూటింగ్ లు నిలిచిపోయి, అన్ని…

కరోనా వల్ల పలు వ్యాపారాలు అద్భుతంగా లాభాలు చేసుకున్నాయి. కొన్ని వ్యాపారాలు నష్టపోయాయి. బాగా ఎక్కువగా నష్టపోయింది సినిమా రంగమే. అటు సినిమాల ప్రదర్శన ఆగిపోయి, ఇటు సినిమాల షూటింగ్ లు నిలిచిపోయి, అన్ని వైపుల నుంచి నష్టాలను ఎదుర్కోంది. కరోనా తొలి దశలో ఇది చాలా ఎక్కువ ప్రభావం చూపింది. మలి దశ ఏ మేరకు ప్రభావం చూపించబోతోందన్నది ఇంకా క్లారిటీ లేదు.

షూటింగ్ లు నిలిచిపోయి, థియేటర్ల బంద్ అయిపోయి రెండు నెలలు దగ్గర పడుతోంది. ఈ రెండు నెలల్లో కూడా చాలా వరకు సినిమాలు ఎంతో కొంత షూటింగ్ చేసుకున్నాయి. ధియేటర్లు ఎప్పడు తెరుచుకుంటాయి అన్నది క్లారిటీ లేదు. ఆగస్టు వరకు వుండవని మాత్రం ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

కోవిడ్ ఆంక్షలు ఎక్కువ, తక్కువగా జూన్ నెల అంతా ఏదో విధంగా కొనసాగుతాయన్నది పక్కా. జూలై నెల లో తెలుగు రాష్ట్రాలు నార్మల్ స్థితికి వచ్చినా థియేటర్లు తెరవడానికి వెంటనే ప్రభుత్వాలు ఓకె అంటాయనే నమ్మకం లేదు. అందువల్ల ఆగస్టు కు కానీ థియేటర్లు తెరుచుకోవు. కానీ పెద్ద సినిమాలు వేచి చూసి కానీ థియేటర్లోకి రావు. 

ఈలోగా చిన్న సినిమాలకు చాన్స్ ఎక్కువ. అందుకే టాలీవుడ్ జనాలు నిర్మాణంలో వున్న చిన్న, మీడియం సినిమాలు ముందుగా కంప్లీట్ చేసేయాలని రెడీ అవుతున్నాయి. దాదాపు ప్రతి పెద్ద నిర్మాణ సంస్థ తమ తమ సిబ్బందికి వ్యాక్సీన్ లు వేయించేసాయి. తమ తమ సినిమాలకు పనిచేసే వారికి కూడా పిలిచి పిలిచి మరీ వ్యాక్సినేషన్ చేయించేస్తున్నాయి. ప్రయివేటుగా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం టాలీవుడ్ లో కాస్త జోరుగానే సాగుతోంది.

అందువల్ల షూటింగ్ లకు పెద్దగా అడ్డంకులు ఇక వుండవు. పైగా షూటింగ్ లు ఆపేయమని ఎక్కడా ఆదేశాలు కూడా లేవు. అందుకే ఈ నెల రెండో వారం తరువాత షూటింగ్ లు ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఇప్పటికే దాదాపు పూర్తి కావచ్చిన, సగం వరకు పూర్తయిన సినిమాలు అన్నీ చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.

ఈ సినిమాలు అన్నీ కూడా ఎసి డిసి సినిమాలే. అయితే థియేటర్ లేదా ఓటిటి అనే ఆప్షన్ కు రెడీగా వున్నవే. అందుకే ఇవన్నీ చకచకా రెడీ చేసి పెట్టుకునే దిశగా టాలీవుడ్ అడుగులు ముందుకువేస్తోంది.