నిరంజన్ రెడ్డి టాలీవుడ్ లాయర్

ఈ రోజు ఫోకస్ అంతా లాయర్ నిరంజన్ రెడ్డి మీదకు వెళ్లింది. అల్లు అర్జున్ అరెస్ట్ కేసును సవాల్ గా తీసుకుని వాదించి,గెలిచింది నిరంజన్ రెడ్డి. చాలా మందికి నిరంజన్ రెడ్డి తెలుసు. కానీ…

ఈ రోజు ఫోకస్ అంతా లాయర్ నిరంజన్ రెడ్డి మీదకు వెళ్లింది. అల్లు అర్జున్ అరెస్ట్ కేసును సవాల్ గా తీసుకుని వాదించి,గెలిచింది నిరంజన్ రెడ్డి. చాలా మందికి నిరంజన్ రెడ్డి తెలుసు. కానీ బన్నీ ఫ్యాన్స్ పరిచయం తక్కువ.

అసలు ఎవరు ఈ నిరంజన్ రెడ్డి? టాలీవుడ్ జనాలతో ఎలా లింక్ అయ్యారు?

నిర్మాత పివిపి కి నిరంజన్ రెడ్డి మంచి మిత్రుడు. అప్పటికి నిరంజన్ రెడ్డి ఓ మంచి లాయర్ అని పేరు వుంది, బిజీ లాయర్, పెద్ద లాయర్ అనే తప్ప సెలబ్రిటీల లాయర్ గా ఇంకా మారలేదు. అలాంటిది నిరంజన్ రెడ్డిని ఒక్కొక్కరికి తన సర్కిల్ లో పరిచయం చేయడం మొదలు పెట్టారు. అలా పరిచయం అయినది జగన్ మోహన్ రెడ్డి కి.

జగన్ మోహన్ రెడ్డి కేసులు వాదించడం మొదలుపెట్టిన తరువాత పివిపి ద్వారానే నాగార్జున కు పరిచయం అయ్యారు. నాగార్జున ద్వారా ఇటు చిరంజీవికి, అటు మహేష్ బాబు కు కూడా పరిచయం అయ్యారు.

ఈ పరిచయాలతోనే నిర్మాతగా మారారు. సైరా సినిమా తీసారు.ఇంకా ఒకటి రెండు సినిమాలు తీసారు. ఆ తరువాత బిజీ లాయర్ గా అస్సలు తీరిక లేక సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఇదే టైమ్ లో వైకాపా తరపున రాజ్య సభకు ఎన్నికయ్యారు.

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం మీద ఎవరికి ఏ లీగల్ సమస్య వచ్చినా గుర్తుకు వచ్చే పేరు నిరంజన్ రెడ్డి. కేసు తీసుకుంటే విజయం ఫిక్స్ అనే టాక్ వుంది. ఈ రోజు చాలా మంది హైకోర్ట్ లైవ్ చూసారు. ఈ లైవ్ లో నిరంజన్ రెడ్డి వాదనాపటిమను చూసారు.

చూసిన తరువాత అర్థం అయింది నిరంజన్ రెడ్డి కేవలం వాదించడంలో మాత్రమే కాదు. కేసుల విషయంలో వున్న అపరిమిత నాలెడ్జ్ వుందని. ఎక్కడెక్కడి కేసులో రిఫరెన్స్ ఇస్తూ, అస్సలు తడుముకోకుండా వాదించ డం చూసిన వాళ్లు ముగ్దులయ్యారు.

ఇకపై టాలీవుడ్ జనాలకు ఏ కష్టం వచ్చినా నిరంజన్ రెడ్డి కదలి రావాల్సిందే. గెలిపించాల్సిందే.

5 Replies to “నిరంజన్ రెడ్డి టాలీవుడ్ లాయర్”

  1. మరి వైసీపీ నందిగం సురేష్ కి, వర్రకి, బోరుగడ్డ కి, ఆర్జీవీ కి, రెడ్డి గారి అమ్మాయి పులి బిడ్డ కి, విజయపాల్ఈ కి యన్నే లాయర్ గా వెయ్యిచ్చుగా..?

  2. ఎంకటి – కామెంట్ డీసెంట్ గా పెట్టినా రిమూవ్ చేస్తావు, భూతులు పెడితే మాత్రం ఉంచుతావు..పాథెటిక్

  3. @-ఎంకటి – కామెంట్-డీసెంట్-గా-పెట్టినా-రిమూవ్-చేస్తావు,-భూతులు-పెడితే-మాత్రం -ఉంచుతావు..పాథెటిక్

  4. మరి బోరుగడ్డకి, వర్ర కి, విజయపాల్ కి, నందిగం కి, పులిబిడ్డ రెడ్డి గారి అమ్మాయికి, ఆర్జీవీ కి ఈయన్నే వెయ్యొచ్చుగా?

Comments are closed.