ఏపీలో బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ బలం నవ్యాంధ్రలో పెరిగింది. 2014లో నాలుగు ఎమ్మెల్యేలు ఉంటే ఇప్పుడు డబుల్ అయ్యారు. నాడు నలుగురిలో ఇద్దరికి మంత్రి పదవులు చంద్రబాబు పొత్తులలో భాగంగా ఇచ్చారు.
ఇప్పుడు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక్కరికే పరిమితం చేశారు. దాని మీద విశాఖ బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. “ఎక్కడైనా సీట్లు పెరిగితే పదవులు వస్తాయి. ఏపీలో బీజేపీ పెరిగినా పదవులు అయితే రాకపోగా తగ్గిపోయాయి,” అంటూ ఆయన సంచలన కామెంట్స్ చేశారు.
ఏపీలో మూడు పార్టీలు బలంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. “మూడు పార్టీలు ఎన్నికలకు వెళ్తే ప్రజలు ఆదరించారు” అని ఆయన గుర్తు చేశారు. దానిని బట్టి పదవులు కూడా మూడు పార్టీలు సమానంగా పంచుకోవాలన్నది విష్ణు కుమార్ రాజు ఉద్దేశ్యం అని అంటున్నారు.
జనసేనకు నాల్గో మంత్రి పదవి దక్కబోతోంది. ఆ పదవిని నాగబాబుకు ఇస్తున్నారని సమాచారం. కూటమిలో జనసేనకు అలా నాలుగు కేబినెట్ బెర్తులు దక్కుతున్నాయి. బీజేపీకి మాత్రం ఒక్క పదవినే ఇచ్చారు. 21 సీట్లు గెలిచిన జనసేనకు నాలుగు పదవులు అంటే ప్రతి అయిదు మంది ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి అన్న నిష్పత్తి. జనసేనకు ఎనిమిది మంది ఉంటే ఇదే నిష్పత్తిలో రెండు మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు.
బీజేపీలో ఏమైనా అసంతృప్తి ఉందా అన్న మీడియా ప్రశ్నకు రాజు బదులిస్తూ, “ఆ విషయం చంద్రబాబుకే తెలుసు,” అన్నారు.
బీజేపీలో అసంతృప్తి ఉందని ఆయన చెప్పకనే చెప్పేశారు అన్న మాట. రెండు సార్లు విశాఖ పశ్చిమ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, రెండు సార్లు బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఉన్న రాజు మంత్రి కావాలని అనుకుంటున్నారు అన్న ప్రచారం సాగింది. ఆ ఒక్క కేబినెట్ బెర్త్ కాస్తా జనసేనకు వెళ్ళింది.
ఏపీలో కూటమి ప్రభుత్వంలో క్షత్రియులకు స్థానం లేదు. ఆ కోటాలో అయినా ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని భావించి ఉండొచ్చు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
He should be happy that he became MLA at the cost of Janasena
అక్కర్లేదు, అత్యాశ వద్దు!