ఎట్టకేలకు అల్లు అర్జున్ జైలు నుండి విడుదల అయ్యారు. నిన్న మధ్యాహ్నం అరెస్టై, బెయిల్ మంజూరైనప్పటికీ సరైన పత్రాలు చంచల్ గూడ జైలు అధికారులకు అందకపోవడంతో, నిన్న రాత్రంతా జైల్లో గడిపిన అల్లు అర్జున్ ఇవాళ విడుదలయ్యారు. అల్లు అర్జున్ జైలు నుంచి బయటకు వస్తున్నారని తెలియడంతో పెద్ద ఎత్తున అభిమానులు జైలు వద్దకు వచ్చినా.. ఆయన జైలు వెనుక గేటు నుండి ఇంటికి వెళ్లిపోయారు.
నిన్న రాత్రి బెయిల్ మంజూరైనా పలు కారణాల వల్ల జైలు నుండి విడుదల ఆలస్యమైంది. జైలు అధికారులు అల్లు అర్జున్‌ను అండర్ ట్రయల్ ఖైదీగా ఖైదీ నంబర్ 7697గా నమోదు చేశారు. రాత్రి 10 గంటల వరకు జైలు రిసెప్షన్‌లో ఉంచిన అధికారులు ఆపై మంజీరా బ్యారక్‌లోని క్లాస్-1 రూమ్‌కు తరలించారు. అక్కడ అల్లు అర్జున్‌తో పాటు మరి ఇద్దరు విచారణలో ఉన్న ఖైదీలు ఉన్నారని తెలుస్తోంది.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మొత్తం 18 మందిని పోలీసులు నిందితులుగా గుర్తించారు. ఈ కేసులో అల్లు అర్జున్‌ను ఏ11గా చేర్చగా, థియేటర్ ఓనర్‌ను ఏ1గా, మరో భాగస్వామి సందీప్‌ను ఏ3గా, మేనేజర్ నాగరాజును ఏ9గా చేర్చారు. ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతుండగా, అల్లు అర్జున్ విడుదల కావడంతో అభిమానుల్లో ఆనందం వెల్లువెత్తింది.
last term of revanth as cm. chala darunam anna idi
సరే ఇక రేవంత్ మిగులు, రేవతి పాపం లేదుగా.
అదృష్టం కలిసి వచ్చినా, కష్టం తో వచ్చినా, దాని వెనక దురదృష్టం ఎప్పుడూ పొంచి ఉంటుంది, అది మన నడవడిక, ఒదిగి ఉండడం, అతి గా స్పందించడం, వీటి మీద ఆధార పడి ఉంటుంది. అది తెలుసుకునే ఒక చిరంజీవి, ఒక రజినీకాంత్, ఒక అమితాబ్, దశాబ్దాలుగా ఆ హోదా కి వన్నె తెచ్చారు. ఈ తరం నటులు కూడా వారిని ఆదర్శంగా తీసుకుంటే కుటిల రాజకీయాలకి నలిగి పోకుండా ఉంటారు.