ప్రతిపక్ష వైసీపీ తీరు చూస్తుంటే, సార్వత్రిక ఎన్నికలు మినహాయిస్తే ఏ ఎన్నికల్లోనూ పోటీ చేసేలా కనిపించడం లేదు. ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను వైసీపీ బహిష్కరించింది. కూటమి ప్రభుత్వ దౌర్జన్యాల రీత్యా తాము పోటీ చేసినా, ఓటర్లను పోలింగ్ బూత్‌లకు రానిచ్చే పరిస్థితి లేదని, అందుకే బహిష్కరిస్తున్నట్టు కారణం చెప్పింది.
తాజాగా సాగునీటి సంఘాల ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు వైసీపీ ప్రకటించింది. కూటమి ప్రభుత్వ దాష్టీకానికి నిరసనగా ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు వైసీపీ పేర్కొంది. ఎన్నికలను కూటమి సర్కార్ అప్రజాస్వామికంగా నిర్వహిస్తోందని వైసీపీ ఆరోపించింది. సీక్రెట్ బ్యాలెట్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించగా, చేతులెత్తాలని ప్రభుత్వ యంత్రాంగం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది.
అధికారులు ఏకపక్షంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనేది నిజమే అయ్యి వుండొచ్చు. 2014-19 మధ్య చంద్రబాబు సర్కార్ 50 శాతం అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తే, జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 100 శాతం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించింది. సీఎం హోదాలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికలలో ఫలితాలను టార్గెట్ పెట్టడంతో , నాడు వైసీపీ ప్రజాప్రతినిధులు అప్రజాస్వామికంగా ప్రవర్తించారు. కనీసం ప్రత్యర్థుల్ని నామినేషన్ కూడా వేయించని దుస్థితి. నాడు వైసీపీ ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా టీడీపీ స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించింది.
నేడు కూటమి సర్కార్ అదే పంథాను అనుసరిస్తోంది. కూటమి సర్కార్‌ను విమర్శించే నైతిక హక్కు వైసీపీకి ఏముందనే ప్రశ్నకు సమాధానం లేదు. నాడు నీవు నేర్పిన ఎన్నికల విద్యే నేడు తాము పాటిస్తున్నామని కూటమి నేతలు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రక్రియను ప్రహసనంగా మార్చిన ఘనత అన్ని రాజకీయ పార్టీలకు దక్కుతుంది. నేడు ఎవరూ ఎవర్నీ తప్పు పట్టే పరిస్థితి లేదు.
నేడు సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అనుసరించిన అప్రజాస్వామిక విధానాల్నే, రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కొనసాగించదనే గ్యారెంటీ లేదు. ఎదుర్కోవాల్సిన వైసీపీ.. రిస్క్ చేయడానికి సిద్ధంగా లేదు. అందుకే మరో ఏడాదిన్నరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ పాల్గొంటుందనే నమ్మకం ఏర్పడడం లేదు. రేపు కూడా ఇదే కారణం చెప్పి, స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తుంది. కూటమి పార్టీలు ప్రజల్లో తమకు వందశాతం ఆదరణ వుందని, నాడు వైసీపీ చెప్పుకున్నట్టే గొప్పలకు పోతాయి. సార్వత్రిక ఎన్నికల్లో అసలుసిసలైన ప్రజాదరణ ఏంటో తెలిసొస్తుంది.
Why only స్థానిక ఎన్నికలు??
Why not సార్వత్రిక ఎన్నికలు??
మావోడు ఇంటింటికి చేసిన మంచి,
ఊరురికీ చేసిన అభివృద్ధి,
మావోడి అతి మంచితనం,
మావోడి అతి నిజాయితీ
వల్ల
కళ్ళు మూసుకున్నా, ఏ ఎన్నిక అయినా 175/175 గెలుస్తాం.. కాకపోతే మావోక్క పార్టీ మాత్రమే పోటీ చెయనీయాలి..
దీనికి బాబూ.. బాబ్బాబు ఒప్పుకోవా చెంద్రబాబు??