అల్లు అర్జున్ రాత్రంతా జైల్లోనే?

ఐకానిక్‌స్టార్ అల్లు అర్జున్ విడుదలపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.

ఐకానిక్‌స్టార్ అల్లు అర్జున్ విడుదలపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినప్పటికీ, ఆయన విడుదల ప్రక్రియలో ఆలస్యం కావడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. జైలు అధికారులు ఇప్పటివరకు బెయిల్ ఉత్తర్వులు అందలేదని చెబుతున్నారు. హైకోర్టు ఉత్తర్వుల కాపీలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ కాలేదని, అల్లు అర్జున్ తరఫు లాయర్లు తెచ్చిన కాపీలో పలు లోపాలున్నాయని అంటున్నారు.

ఇప్పటి పరిస్థితిని చూస్తుంటే అల్లు అర్జున్ విడుదల ఈ రోజు సాధ్యమయ్యేలా లేదని జైలు అధికారులు అభిప్రాయపడ్డారు. బెయిల్ పత్రాల లోపాలను సరిచేసే వరకు ఆయన జైల్లోనే ఉండాల్సి వస్తుందని స్పష్టంచేశారు. ఈ పరిస్థితుల మధ్య, అల్లు అర్జున్ రాత్రంతా చంచల్ గూడ జైలులోనే ఉండే అవకాశం కనిపిస్తోంది. అల్లు అర్జున్ కోసం చంచల్ గూడ జైలులో క్లాస్-1 బ్యారక్ కూడా సిద్దం చేశారు జైలు అధికారులు.

ఈ పరిణామాలపై అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ చంచల్ గూడ జైలుకు చేరుకొని పరిస్థితి సమీక్షించారు. అయితే, ప‌రిస్థితి త‌మ‌కు అనుకున్న విధంగా లేక‌పోతే అస‌హ‌నంతో చివరికి క్యాబ్ బుక్ చేసుకుని జైలు నుంచి వెళ్ళిపోయారు.

ఈ ఆలస్యంపై అల్లు అర్జున్ అభిమానులు ఆగ్రహంతో చంచల్ గూడ జైలు ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్నారు. ‘అల్లు అర్జున్‌కు న్యాయం చేయాలి’ అంటూ నినాదాలు చేస్తూ, వెంటనే ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అల్లు అర్జున్ విడుదలపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతుండటంతో అభిమానులు, మీడియా ప్రతినిధులు జైలు వద్దే ఎదురు చూస్తున్నారు.

11 Replies to “అల్లు అర్జున్ రాత్రంతా జైల్లోనే?”

  1. Why dis his father show frustration? Did Allu Arvind visit victim’s family? There were so many freedom fighters who spent years in jail. Cannot he stay single night in jail? Revanth has given strong message to the society that life of an ordinary person is important. With his arrest, future incidents at least, if not increased, will be reduced.

  2.  ఇదో పెద్ద డ్రామా అని నాకు అనిపిస్తుంది . అల్లు అర్జున్ భాగ bad అయినాడు కాబట్టి అతనికి సింపతీ రావటానికి పెద్దవాళ్ళు ఆడిన డ్రామా గా ఉంది తప్ప ఇందులో ఏమాత్రం నిజం లేదు . లేక పోతే నిన్నFIR ఫైల్ చెయ్యడం ఏంటి remand నిన్నే ఇవ్వడం ఏంటి bail కూడా నిన్నే ఇవ్వడం ఏంటి . ఇక్కడ ప్రజలే ఎర్రిపప్పలు తప్ప పెద్దవ్వల్లు ఆడిన chess game ఇది

Comments are closed.