బన్నీ అరెస్ట్.. సీఎం రేవంత్ రియాక్షన్ ఇదే!

ఓ ఫిలింస్టార్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. అది ఆయన వ్యాపారం, డబ్బులు పెట్టాడు, లాభం తెచ్చుకున్నాడు.

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మహిళ మృతి చెందడంపై నమోదైన కేసులో హీరో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాడు. ఓ వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఎందుకింత చర్చ అని ప్రశ్నిస్తున్నారు.

“ఒక వ్యక్తిని (అల్లు అర్జున్) పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తే ఇంత చర్చ చేస్తున్నారు. ఆ దుర్ఘటనలో ఓ మహిళ ప్రాణం పోయింది. దాని గురించి ఎవ్వరూ మాట్లాడ్డం లేదు. ఆమె కొడుకు హాస్పిటల్ లో ఉన్నాడు. చావుబతుకుల మధ్య ఉన్నాడు. హాస్పిటల్ నుంచి బయటకొచ్చిన తర్వాత తల్లి లేదని తెలిస్తే వాడి పరిస్థితేంటి? వాళ్లు ఎలా ఉన్నారు, ఆ కుటుంబం ఎలా బతుకుతుందనే చర్చ ఎవ్వరూ చేయడం లేదు. ఓ ఫిలింస్టార్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. అది ఆయన వ్యాపారం, డబ్బులు పెట్టాడు, లాభం తెచ్చుకున్నాడు. ఇందులో నాకొచ్చేముంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉంటాడు, స్థలం కొంటాడు, ఫ్లాట్స్ కడతాడు, లాభానికి అమ్ముకుంటాడు. ఇది కూడా అంతే. వీళ్లేమైనా సరిహద్దుకు వెళ్లి పాకిస్థాన్ తో పోరాడి ఇండియాను గెలిపించారా? సినిమా తీశారు, డబ్బులు చేసుకున్నారు, ఇంటికెళ్లారు.”

హోం శాఖ తనవద్దే ఉందని, అల్లు అర్జున్ కేసుకు సంబంధించిన సమస్త సమాచారం తనకు తెలుసని.. ఈ విషయంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందని, తను జోక్యం చేసుకోనని స్పష్టంగా ప్రకటించారు రేవంత్ రెడ్డి.

తనకు అల్లు అర్జున్ చిన్నప్పట్నుంచి తెలుసన్నారు రేవంత్ రెడ్డి. అల్లు అర్జున్ మామ చిరంజీవి, పిల్లనిచ్చిన మామ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నేతలేనని గుర్తుచేశారు. పైగా అల్లు అర్జున్ భార్య తమకు బంధువు కూడా అవుతుందని.. ఇవేవీ కేసుపై ప్రభావం చూపవని అన్నారు.

తెలుగులో తనకు హీరో కృష్ణ అంటే చాలా ఇష్టమని, ప్రస్తుతం తనకు ఫేవరెట్ హీరో అంటూ ఎవరూ లేరంటున్న రేవంత్.. అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని ఎవరైనా చట్టవిరుద్దంగా నిరసన తెలిపితే వాళ్ళని కూడా జైల్లో వేస్తామని హెచ్చరించారు.

20 Replies to “బన్నీ అరెస్ట్.. సీఎం రేవంత్ రియాక్షన్ ఇదే!”

  1. Idi kada assalaina rule ante… revanth reddy rule… Lekapothe nee Balupu tho CM Peru marchipoyavu ra allu arjun…ippudu assaalu marchipovu life lo….assaalu thaggedhele…. Wild fire …. Revanth reddy ….ikanaina Balupu thagginchuko ra bunny…

  2. Vachadandi sudhapusa. Thamaru notla kottala bag thi addam ga red handed ga dorikinappudu chattam thana pani thanu enduku cheyaledo mari. Appudu chattam gurru petti niddaroyinda?

    1. Appudu athanu A1 aa case lo…jail lo velli vachadu…case is under court still..but evvari chavuku kaaranam kaadu … Ikkada ee bunny gaadu balisi kottukontunadu…anduke CM Peru gurthu raadu avasaram theeri poyaka… Veedi Balupu ki ide correct….jai revanth reddy

  3. Idi kada assalaina rule ante… revanth reddy rule… Lekapothe nee Balupu tho CM Peru marchipoyavu ra allu arjun…ippudu assaalu marchipovu life lo….assaalu thaggedhele…. Wild fire …. Revanth reddy

  4. అల్లు అర్జున్ హీరో కదా, హీరో అంటే ఫ్యాన్స్ పడి చస్తారు కదా. చస్తే కేసు ఏమిటి, నాన్సెన్స్.

    కొంపలు మునిగిపోయేంత స్పీడుగా బెయిల్ ఇచ్చేసారు, నేషనల్ హీరో అయిపోయాడు ఈరోజు.

    తప్పులేదు, కసబ్ లాంటోడికి ఏళ్లకు తరబడి బిర్యనిలతో మెపే దేశం మనది.

    రైతులపై సినిమా తీస్తే చూసే కాలం నుంచి, స్మగ్లర్ హీరో స్థాయికి సమాజం దిగజారింది

Comments are closed.