టాలీవుడ్ లో ఫ్లెష్ ట్రేడ్?

బెంగళూరు రేవ్ పార్టీ నేపథ్యంలో కొత్తగా మరోసారి తలెత్తిన ప్రశ్న.. టాలీవుడ్ లో అవకాశాల మాటున వ్యభిచారం జరుగుతోందా? నిజానికి టాలీవుడ్ లో ఇలాంటి గ్యాసిప్ లు చాలా వున్నాయ. చాలా కాలం నుంచి…

బెంగళూరు రేవ్ పార్టీ నేపథ్యంలో కొత్తగా మరోసారి తలెత్తిన ప్రశ్న.. టాలీవుడ్ లో అవకాశాల మాటున వ్యభిచారం జరుగుతోందా? నిజానికి టాలీవుడ్ లో ఇలాంటి గ్యాసిప్ లు చాలా వున్నాయ. చాలా కాలం నుంచి వున్నాయి. అవకాశాల కోసం, అవసరం కోసం, కమిట్ కావడం అన్నది కామన్ థింగ్ టాలీవుడ్ లో అని చాలా సింపుల్ గా అనేస్తుంటారు. వినిపిస్తుంటుంది. అలా కాకుండా కేవలం ఈ వృత్తి మీదే టాలీవుడ్ లో వుంటూ, అదే పని మీద అటు ఇటు అమ్మాయిలను తిప్పే ‘క్వీన్ పిన్’ లు లేదా ‘కింగ్ పిన్’ లు వున్నారు అనే మాట వినిపించడం అంటే కాస్త సంచలనమే.

బెంగళూరు పార్టీకి టాలీవుడ్ లేదా హైదరాబాద్ నుంచి పాతిక మంది వరకు అమ్మాయిలను ప్రత్యేకంగా ఓ ‘క్వీన్ పిన్’ ఆధ్వర్యంలో తీసుకెళ్లారు అనే గ్యాసిప్ బలంగా వినిపిస్తోంది. ఇది జస్ట్… అదిగో పులి.. ఇదిగో తోక అన్న చందమేనా? ఓ బిజినెస్ మెన్ కు టాలీవుడ్ తో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధం వున్న అమ్మాయిలకు ఏమిటి లింక్? అంత పెద్ద పార్టీ ఇవ్వగలిగిన వారు ఎలాంటి వారిని ఆహ్వానిస్తారు. ఆ లెవెల్ వారినే కదా. లేదా వారికి సన్నిహితులనే కదా. మరి ఈ అమ్మాయిల సంగతేమిటి? వీళ్లను ఎందుకు పిలిచినట్లు? ఎందుకు వెళ్లినట్లు?

ఇక్కడ డ్రగ్స్ వాడారా? లేదా అన్నది సమస్య కాదు. పాయింట్ కాదు. ఆ పార్టీకి వీళ్లను ఏ విధంగా ఆహ్వానించారు..వీళ్లు అక్కడికి వెళ్లింది దేని కోసం అన్నదే. ఈ లెక్కన చూస్తుంటే అరకొర అందం లేదా అంతంత మాత్రం ఎలిజిబులిటీ వుండి, టాలీవుడ్ లో లక్ పరిక్షించుకోవాలని వచ్చి, ఇక్కడ ‘కొందరి’చేతుల్లో అమ్మాయిలు చిక్కుకుపోతున్నారనే మాట వినిపిస్తోంది.

కొన్నాళ్ల క్రితం ఓ పెద్దింటి లేదా డబ్బున్న ఇంటి అమ్మాయి నటన మీద పిచ్చి అభిమానంతో వచ్చి ఓ ‘క్వీన్ పిన్’ చేతిలో చిక్కుకుపోయిందట. ముందుగా మందు, ఆ తరువాత మిగిలినవి అలవాటు చేయడం తప్ప నటన వేపు వెళ్లనివ్వలేదు. ఇంటి జనాలకు అది తెలియడంతో, పలుకుబడి వున్నవాళ్లు కావడంతో, ఇక్కడకు వచ్చి ఆ ‘క్వీన్ పిన్’ను బెదరగొట్టి, తమ అమ్మాయిని వెనక్కు తీసుకువెళ్లారనే కథ టాలీవుడ్ లో వినిపిస్తోంది.

ఇక వినిపించని కథలు ఇలాంటివి ఎన్ని వున్నాయో మరి?  ఇక్కడ ఎవరి బలాలు, ఎవరి బలగాలు వారికి వున్నాయి. అదే టైమ్ లో ఎవరి అవసరాలు వారికి వున్నాయి. రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు ఇలా చాలా మందికి ఎర అయిపోయేది టాలీవుడ్ ను నమ్ముకుని అమాయకంగా ఇక్కడకు వచ్చిన వారే.

హైదరాబాద్ లో టాలీవుడ్ కు సంబంధించి ఏం జరిగినా కొన్ని రోజులు హడావుడే. అది అనేక సార్లు ప్రూవ్ అయిన సత్యం. మరి బెంగళూరు వ్యవహారం కూడా అలాగే వుంటుందా? నిజాలు బయటకు వస్తాయా? వేచి చూడాల్సిందే.