టాలీవుడ్ టికెట్ ల సమస్యకు మోక్షం వస్తున్నట్లు కనిపిస్తోంది. టాలీవుడ్ పెద్దలను పిలవకుండానే టికెట్ లను సవరించే ఆలోచన ప్రభుత్వం వైపు జరుగుతున్నట్లు వార్తలు అందుతున్నాయి.
ఈ మధ్య ఇచ్చిన జీవో కు సవరణ జీవో ఇవ్వడం ద్వారా టికెట్ రేట్లు సవరించే అవకాశం వుందని తెలుస్తోంది. ఆ తరువాతే ఇండస్ట్రీ జనాలను పిలిచి, మిగిలిన సమస్యలు, ప్రభుత్వం వైపు ప్రతిపాదనలు డిస్కస్ చేసే అవకాశం వుంది.
అయితే ఏ మేరకు సవరిస్తారు? ఎగ్జిబిటర్లు అన్న మేరకు సవరిస్తారా? లేక ఇంకా తక్కువ సవరిస్తారా? కేవలం బి సి సెంటర్లు సవరిస్తారా? అన్నది తెలియాల్సి వుంది. ఈ విషయమై ఓ అధికార్ల బృందం కసరత్తు చేస్తోంది. ఆ కసరత్తు పూర్తయిన తరువాత సిఫార్సులు సిఎమ్ కు అందుతాయి. అప్పుడు ఆయన నిర్ణయం తీసుకుంటారు.
అంతా సానుకూలంగా జరిగితే త్వరలోనే కొత్త రేట్లు వస్తాయని భావిస్తున్నారు. ఆ తరువాత టాలీవుడ్ పెద్దలను కూర్చోపెట్టి, ఆన్ లైన్ టికెటింగ్ ఇతరత్రా వ్యవహారాలు డిస్కస్ చేసే అవకాశం వుంది.