ఈ మాట మేము అనడం లేదు. సినిమా ఇండస్ట్రీలో జనాలు పైకి అనకుండా ఆఫ్ ది రికార్డుగా అంటున్న మాట ఇది. థియేటర్లు ఓపెన్ కాకుండా సురేష్ బాబు, దిల్ రాజు, అల్లు అరవింద్, యువి వంశీ లాంటా వాళ్లు అడ్డం పడుతున్నారని, కేవలం ఆసియన్ సునీల్ మాత్రమే థియేటర్లు ఓపెన్ చేయాలని కోరుతున్నారని, ఇది ఎగ్జిబిటర్ల ధౌర్భాగ్యం అని టాలీవుడ్ జనాలు అంటున్నారు.
సినిమా మీడియా ఈ విషయం దిశగా దృష్టి సారించాలని అంటున్నారు వాళ్లు. కేసిఆర్ కానీ కేటిఆర్ కానీ థియేటర్లు తెరవడానికి అభ్యంతరం చెప్పడం లేదు కేవలం ఈ కొందరు సినిమా పెద్దలు మాత్రమే థియేటర్లు ఓపెన్ చేయకుండా అడ్డం పడుతున్నారు అని పలువురు నిర్మాతలు ఫోన్ చేసి మరీ చెబుతున్నారు.
ఇదేదో మీరే చెప్పచ్చు కదా? అని అడిగితే అడిగే పరిస్థితి టాలీవుడ్ లో లేదంటున్నారు. గిల్డ్ అని పెట్టారు కానీ గిల్డ్ పెద్దలకే థియేటర్లు ఓపెన్ చేయడం ఇష్టం లేదని చెబుతున్నారు.
కొంతమంది సినిమా నిర్మాతల చేతిలో థియేటర్లు వుండడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతోందని, ఆ నిర్మాతలే సినిమాలు తీయాలి, విడుదల చేయాలి, వాళ్ల చేతిలోనే గిల్డ్ వుంటుంది. వాళ్ల చేతిలోనే డిస్ట్రిబ్యూషన్ వుంటుంది.
అందుకే తెలివిగా, థియేటర్లు తీసుకుంటే తీసుకోండి, సినిమాలు కావాలంటే కొనుక్కుని వేసుకోండి అనే టైపులో మాట్లాడుతున్నారని అంటున్నారు. అంతే కానీ థియేటర్లను బతికించే మార్గం చూడడం లేదని అంటున్నారు.
కన్నడ రంగంలో సినిమా థియేటర్లు ఓపెన్ చేయడం పై హార్ట్ టచింగ్ విడియోలు చేసి వదులుతుంటే మన సినిమా పెద్దలు వంటలు, పెరటి తోటలు లాంటి విడియోలు తీసివదుల్తున్నారంటున్నారు.
ఎవ్వరికీ కూడా థియేటర్లు తెరవడం మీద సీరియస్ నెస్ లేదని, కానీ మళ్లీ వీరే ఎలాగైనా కరెంటు బిల్లుల రద్దు సంపాదించాలని చూస్తున్నారంటున్నారు. మొత్తం మీద ఈ సంక్రాంతికి కూడా థియేటర్లు కళకళలాడతాయన్నది సందేహంగా వుంది.