టాలీవుడ్ లో ఎవరూ ఊహించని రికార్డ్ ఒకటి నమోదైంది. ఈ మధ్య కాలంలో హయ్యస్ట్ రిలీజెస్ జరిగిన సంవత్సరంగా 2022 చరిత్రలో నిలిచిపోనుంది. ఈ ఏడాది ఏకంగా 297 సినిమాలు (డబ్బింగ్ తో కలిపి) రిలీజ్ అయ్యాయి. టాలీవుడ్ చరిత్రలో ఇదో రికార్డ్.
ఈ వారం రిలీజ్ అవుతున్న 10 సినిమాలతో కలుపుకొని 2022లో మొత్తం విడుదలల సంఖ్య 297కు చేరుకుంటుంది. గడిచిన పుష్కర కాలంగా చూసుకుంటే, ఈ 12 ఏళ్లలో టాలీవుడ్ లో ఎన్నడూ ఈ స్థాయిలో సినిమాలు రిలీజ్ అవ్వలేదు.
ఇప్పటివరకు ఈ రికార్డ్ 2014 సంవత్సరం పేరిట నమోదై ఉంది. ఆ ఏడాది అత్యథికంగా 276 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ రికార్డ్ ను 2022 సంవత్సరం తిరగరాసింది. మూడో స్థానంలో 2013 (270 సినిమాలు రిలీజ్) నిలిచింది.
కరోనా వల్ల 2020లో చాలా సినిమాలు ఆగిపోయాయి. టాలీవుడ్ చరిత్రలోనే అత్యల్పంగా 65 సినిమాలు రిలీజ్ అయిన సంవత్సరంగా ఇది నిలిచింది. అలా ఆగిపోయిన సినిమాల్లో చాలామటుకు 2021 చివరి నాటికి పూర్తయ్యాయి.
అలా పూర్తయిన సినిమాలన్నీ 2022లో థియేటర్ల ముందు క్యూ కట్టాయి. ఫలితంగా టాలీవుడ్ లో అత్యథిక రిలీజెస్ చూసిన ఏడాదిగా 2022 నిలిచింది.
టాలీవుడ్ లో అత్యథిక సంఖ్యలో రిలీజ్ అయిన సినిమాల టాప్-5 జాబితా ఇది
2022 – 297 సినిమాలు రిలీజ్, 2014 – 276 సినిమాలు, 2013 – 270 సినిమాలు, 2019 – 269 సినిమాలు, 2016 – 266 సినిమాలు