హాలీవుడ్ ప్రముఖ నటుడికి కరోనా

హాలీవుడ్ స్టార్ నటుడు టామ్ హ్యాంక్స్ కు కరోనా సోకింది. ఆయన భార్య రీటా విల్సన్ కు కూడా కరోనా వచ్చింది. తనతో పాటు తన భార్యకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు స్వయంగా టామ్…

హాలీవుడ్ స్టార్ నటుడు టామ్ హ్యాంక్స్ కు కరోనా సోకింది. ఆయన భార్య రీటా విల్సన్ కు కూడా కరోనా వచ్చింది. తనతో పాటు తన భార్యకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు స్వయంగా టామ్ హ్యాంక్స్ ప్రకటించాడు. ప్రస్తుతం వీళ్లిద్దరూ ఆస్ట్రేలియాలో ఉన్నారు.

“మేం కొంచెం అలసి ఉన్నాం. మాకు జలుబు చేసింది, ఒళ్లు నొప్పులు కూడా ఉన్నాయి. రీటాకు కూడా కొద్దికొద్దిగా దగ్గు, జ్వరం ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల ప్రభావం వల్ల మేం కూడా పరీక్షలు చేయించుకున్నాం. అది కరోనా పాజిటివ్ గా తేలింది.”

ప్రస్తుతం హ్యాంక్స్ తో పాటు ఆయన భార్యను వైద్యులు ఐసోలేషన్ వార్డుకు తరలించారు. వాళ్లకు ట్రీట్ మెంట్ ప్రారంభమైంది. ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా మేం ఐసోలేషన్ వార్డులో ఉండడమే కరెక్ట్ అంటూ టామ్ కూడా స్పందించాడు.

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో 136 కరోనా కేసులు బయటపడ్డాయి. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి ఆ దేశంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రముఖ హాలీవుడ్ నటుడు టామ్ హాంక్స్ కూడా కరోనా సోకడంతో ఇప్పుడు ప్రపంచం దృష్టి మొత్తం ఆస్ట్రేలియాపై పడింది.

ఆది సోదరులూ వైసీపీలోకే.