ఉప్పెన సినిమాతో తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు వైష్ణవ్ తేజ్. ఆ సినిమా అతనికి మాత్రమే కాదు, దర్శకుడు బుచ్చిబాబుకు కూడా అది తొలిసినిమానే. అయితే ఆ సినిమా హిట్ తరువాత రెండో సినిమా క్రిష్ డైరక్షన్ లో పూర్తి చేసాడు వైష్ణవ్ తేజ్.
మూడో సినిమా ఎప్పుడో ఓకె చేసింది. తమిళ అర్జున్ రెడ్డి తీసిన దర్శకుడు పని చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ తరువాత సినిమాల విషయంలోనే వైష్ణవ్ ఏకైక డిమాండ్ నిర్మాతలకు బ్రేక్ వేస్తోందని బోగట్టా.
భారీ సినిమాలు తీసే డైరక్టర్లు తన ఛాయిస్ అని వైష్ణవ్ తెగేసి చెబుతున్నట్లు తెలుస్తోంది. పెద్ద డైరక్టర్లు కావాలని నిర్మాతలకు క్లారిటీగా చెబుతున్నట్లు తెలుస్తోంది. నాలుగో సినిమాకు సురేందర్ రెడ్డిని ఫిక్స్ చేసుకున్నాడు కానీ ఆయనకు రెండు సినిమాలు ప్రయర్ కమిట్ మెంట్లు వున్నాయి.
కొత్త డైరక్టర్లకు చాన్స్ ఇవ్వడం అన్నది ఓపక్క ఉధృతంగా సాగుతూనే వుంది.కానీ అదే సమయంలో, నాగ్ చైతన్య, సాయి ధరమ్ తేజ్ ఇంకా పలువురు హీరోలు ఒకటి రెండు సినిమాలు చేసిన వారికే అవకాశం అంటున్నారు. వైష్ణవ్ తేజ్ ఒక రేంజ్ డైరక్టర్లు అయితేనే రెడీ అంటున్నారు.
మొత్తం మీద సోలోగా సినిమాను లాగడానికి హీరోలు అంత సుముఖంగా లేరనుకోవాలి.
వైష్ణవ్ దాదాపు రెడీగానే వున్నారు, సినిమాలు చేయడానికి నిర్మాతలు సుముఖంగానే వున్నారు.