రివ్యూవర్లు గా టాప్ హీరోలు

మంచి సినిమా వస్తే ఓ ట్వీట్ వేసి ఎంకరేజ్‌ చేయడం అన్నది మంచి పని. పెద్ద హీరోలు, సెలబ్రిటీ లు ఇలా చిన్న సినిమాల కోసం ట్వీట్ వేసినా, ఓ బైట్ ఇచ్చినా దాని…

మంచి సినిమా వస్తే ఓ ట్వీట్ వేసి ఎంకరేజ్‌ చేయడం అన్నది మంచి పని. పెద్ద హీరోలు, సెలబ్రిటీ లు ఇలా చిన్న సినిమాల కోసం ట్వీట్ వేసినా, ఓ బైట్ ఇచ్చినా దాని ఫలితం చాలా గట్టిగా వుంటుంది. అలాగే ఇది కొత్త విషయం కాదు. గతంలో కూడా చాలా సినిమాలకు వేస్తూనే వచ్చారు. అయితే ఇటీవల వేస్తున్న ట్వీట్ లు కొత్తగా వుంటున్నాయి. జ‌స్ట్ సినిమా బాగుంది.. చూడండి..లేదా చూసాను.. బాగుంది అని చెప్పి ఊరుకోవడం లేదు. ఓ చిన్న పాటి ట్వీట్ రివ్యూ ఇచ్చేస్తున్నారు.

మత్తువదలరా 2 సినిమా కు మహేష్ బాబు ఇచ్చిన ట్వీట్ చూస్తే..

నవ్వుల బండి… చివరంటా ఎంజాయ్ చేసా.. అందరి పెర్ ఫార్మెన్స్ బాగుంది. వెన్నెల కిషోర్ ను స్క్రీన్ మీద చూస్తుంటే మా అమ్మాయి నవ్వాపలేకపోయింది. సత్య ను చూస్తే మా ఇంటిల్లిపాదీ నవ్వుతూనే వున్నాము.. గుడ్ టైమింగ్ వుంది అతనికి..

ఇలా సాగింది ట్వీట్. ఓ మంచి సినిమాను, చిన్న సినిమాను ఎంకరేజ్ చేస్తూ ఇలా ట్వీట్ వేయడం తప్పు అని కాదు. రాజ‌మౌళితోనో, మైత్రీ మూవీస్ తోనో వున్న మొహమాటానికి మహేష్ బాబు ట్వీట్ వేయడం వరకు ఓకె. కానీ ఈ రేంజ్ లో వేయడం కొత్త.

మెగాస్టార్ చిరు కూడా ఓ ట్వీట్ వేసారు. ప్రస్తుతం చిరు చేస్తున్న విశ్వంభర సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నది కీరవాణి. మరి అలాంటి కీరవాణి కొడుకు హీరోగా వచ్చిన సినిమా కదా. పైగా సినిమా బాగుంది. అందువల్ల ఓ ట్వీట్ వేయడం తప్పేమీ కాదు.

కానీ చిరు వేసిన లెంగ్తీ ట్వీట్ దాదాపు ఓ చిన్నపాటి రివ్యూ మాదిరిగానే వుంది.

‘’..నిన్ననే ‘మత్తు వదలరా – 2’ చూసాను. ఈ మధ్య కాలంలో మొదటి నుంచి చివరిదాకా ఇంతలా నవ్వించిన సినిమా నాకు కనపడలేదు. End Titles ని కూడా వదలకుండా చూసాను. ఈ క్రెడిట్ అంతా రితేష్ రాణా కి ఇవ్వాలి. అతని రాత, తీత, కోత, మోత, ప్రతీది చక్కగా బ్యాలెన్స్ చేస్తూ మనల్ని వినోద పర్చిన విధానానికి అభినందించకుండా వుండలేము. Hats off @RiteshRana ! నటీ నటులకు Simhakoduri23 కి , ప్రత్యేకించి ‘#Satya’ కి నా అభినందనలు! అలాగే @fariaabdullah2 @kaalabhairava7 లకు మంచి విజయాన్ని అందుకున్న @mythriofficial సంస్థకు, టీం అందరికీ నా అభినందనలు!

రాత.. తీత.. కోత.. మోత.. అంటూ రైటింగ్, టేకింగ్, ఎడిటింగ్, సౌండింగ్ గురించి మెచ్చుకోవడం అదీ చూస్తే ఇది ఓ ‘మెగా’ మినీ రివ్యూలాగే వుంది.

కీరవాణి.. రాజ‌మౌళి.. మైత్రీ… మొహమాటలు మరెన్ని ట్వీట్ రివ్యూలు వేయిస్తాయో చూడాలి.

11 Replies to “రివ్యూవర్లు గా టాప్ హీరోలు”

  1. Tweet cheyyakapote chinna cinemas promote cheyyatledantav. Simple tweet cheste mohamatam antav. Kontha detailed tweet veste kuda mohamatamena?. Keeravani koduku Ani link chesav Mari atani kosam review/tweet lo ekkuva rayalede vallu. Iddaru Satya kosame rasaru. Ante genuine ga rasaru anukovachuga

  2. Tweet cheyyakapote chinna cinemas promote cheyyatledantav. Simple tweet cheste mohamatam antav. Kontha detailed tweet veste kuda mohamatamena?. Keeravani ko*duku Ani link chesav Mari atani kosam review/tweet lo ekkuva rayalede vallu. Iddaru Satya kosame rasaru. Ante genuine ga rasaru anukovachuga?

Comments are closed.