నాగ్ చైతన్య..విక్రమ్ కే కుమార్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మించిన సినిమా థాంక్యూ. ఈ సినిమా విడుదల డేట్ ను రెండు వారాలు వెనక్కు జరిపారు. దీనికి కారణం మరేమీ కాదట…ఈ సినిమాకు రావాల్సినంత బజ్ రాలేదని దిల్ రాజు ఫీలవుతున్నారట. ఇప్పటికి రెండు పాటలు విడుదల చేసారు. కానీ ఒక్క పాట కూడా జనాల్లోకి వెళ్లలేదు.
థమన్..విక్రమ్ కుమార్ కాంబినేషన్ సాంగ్స్ ఎందుకలా వచ్చాయో వారికే తెలియాలి. అయితే మరో రెండు పాటలు విడుదల చేయాల్సి వుంది. అవి కాస్త బాగుంటాయి..జనంలోకి వెళ్తాయి అని యూనిట్ నమ్ముతోంది.
అందుకే పబ్లిసిటీ పెంచి, పాటలు వదిలి, అప్పుడు సినిమాను విడుదల చేయాలన్నది ప్లాన్ అంట. అందుకే రెండు వారాలు టైమ్ తీసుకుంటున్నారు.
ఇదిలావుంటే ఈ సినిమాను ఓటిటి కి ఇవ్వాలని దిల్ రాజు ప్రయత్నించారని, కానీ ఓటిటి సంస్థలు ఔట్ రేట్ గా సినిమాలు కొనడం మానేయడంతో వీలు కాలేదని, అందుకే థియేటర్ లోకి తేక తప్పలేదని బలమైన గ్యాసిప్ లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.
తన ఎదుగుదల అంతా తన ప్రతిభే అని విర్రవీగే యువకుడు, తప్పు తెలుసుకుని, తన అభివృద్దికి కారణమైన వారందరినీ వెదుక్కుంటూ వెళ్లి, వాళ్లకు థాంక్స్ చెప్పడమే థాంక్యూ కాన్సెప్ట్.